Bhadradri Crime : భద్రాద్రి కొత్తగూడెంలో కిరాతకం, ప్రియురాలిని చంపి ముక్కలుగా చేసి పత్తి చేనులో పడేసిన ప్రియుడు
Bhadradri Crime : భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం జరిగింది. ఆర్థిక లావాదేవీలతో స్వాతి అనే మహిళలను ఆమె ప్రియుడు అతి కిరాతంగా హత్య చేశాడు. స్వాతిని హత్య చేసి ముక్కలుగా చేసి మూటకట్టి పక్కనున్న పొలాల్లో పడేశాడు. స్వాతి మిస్సింగ్ కేసు దర్యాప్తులో సంచలనాలు వెలుగులోకి వచ్చాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్వాతి అనే యువతిని ఆమె ప్రియుడు వీరభద్రం అతి కిరాతకంగా హత్య చేసి ముక్కలుగా చేసి పత్తి పొలంలో పడేశాడు. జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హత్య జరిగిన మూడు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మణుగూరు మండలం తోగ్గుడేనికి చెందిన స్వాతి(32) కొన్నేళ్లుగా వీరభద్రంతో సహజీవనం చేస్తుంది. వీరు మాచినేనిపేట తండాలో నివాసం ఉంటున్నారు. వీరభద్రం తన భార్య, ప్రియురాలు స్వాతితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. స్వాతికి, వీరభద్రం మధ్య కుటుంబ తగాదాలు, ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు తలెత్తాయి. అలాగే వీరభద్రం పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దీంతో ప్రియురాలు స్వాతిని అడ్డు తొలగించుకోవాలని వీరభద్రం నిర్ణయించుకున్నాడు. ఈనెల 9న తన ఇంట్లోనే స్వాతిని అతికిరాతంగా హత్య చేశాడు. అనంతరం స్వాతి మృతదేహాన్ని ముక్కులుగా చేసి సమీపంలోని తన పత్తి పొలంలో పడేశాడు.
రూ.16 లక్షల వ్యవహారం
జూలూరుపాడు మండలానికి చెందిన పార్వతి, రత్న కుమార్ అనే దంపతులకు సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని వీరభద్రం, స్వాతి రూ.16 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం రాకపోవడంతో వడ్డీ భారం భరించలేక రత్నకుమార్, పార్వతి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్వాతి, మృతి చెందిన రత్నకుమార్ కుటుంబానికి డబ్బులు తిరిగి ఇస్తానని హామీ ఇచ్చింది. డబ్బులు విషయంలో స్వాతి, ఆమె ప్రియుడు వీరభద్రం మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ రూ. 16 లక్షలు వ్యవహారం స్వాతి ఎక్కడ బయటపెట్టి తనను పోలీసులకు పట్టిస్తుందోనని వీరభద్రం భయపడ్డాడు. స్వాతిని తన ఇంట్లోనే హతమార్చాడు. ఆమెను ఎవరూ గుర్తుపట్టలేనంతగా 20 ముక్కలు చేశాడు వీరభద్రం. స్వామి మృతదేహాన్ని సమీపంలోని పత్తిపొలంలో పడేశాడు.
స్వాతి ఆచూకీ తెలియకపోవడంతో ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వామి మిస్సింగ్ కేసు నమోదు చేసిన భద్రాది పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఓ రైతు నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. పంట పొలంలో అనుమానాస్పదంగా ఓ మూడు ఉందని తెలిపాడు. ఆ మూటలో ముక్కలుగా ఉన్న మహిళ మృతదేహాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఆ మూటను ఆసుపత్రికి తరలించి పరిశీలించగా స్వాతి మృతదేహంగా తెలిసింది. ఈ కేసును విచారణలో వీరభద్రం గురించి తెలిసి తమ స్టైల్ లో విచారించారు. విచారణలో స్వాతిని హత్య చేసినట్లు వీరభద్రం ఒప్పుకున్నాడు.
సంబంధిత కథనం