Bhadradri Online tickets: భద్రాచలం రాములోరి కళ్యాణం ఆన్‌లైన్‌ టిక్కెట్ల విడుదల… ఏప్రిల్ 17న సీతారాముల కళ్యాణం-bhadrachalam seetha rama kalyanam online tickets released ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhadradri Online Tickets: భద్రాచలం రాములోరి కళ్యాణం ఆన్‌లైన్‌ టిక్కెట్ల విడుదల… ఏప్రిల్ 17న సీతారాముల కళ్యాణం

Bhadradri Online tickets: భద్రాచలం రాములోరి కళ్యాణం ఆన్‌లైన్‌ టిక్కెట్ల విడుదల… ఏప్రిల్ 17న సీతారాముల కళ్యాణం

Sarath chandra.B HT Telugu

Bhadradri Online tickets: భద్రాచలం సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక వేడుకల టిక్కెట్లను నేటి నుంచి ఆన్‌లైన్‌ విడుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

భద్రాచలం ఆలయంలో సీతారాముల కళ్యాణం ఆన్‌లైన్ టిక్కట్లు

Bhadradri Online tickets: భద్రాచలం Bhadrachalam సీతారాముల కల్యాణం kalyanam, పట్టాభిషేకం  pattabhishekamవేడుకల్లో నేరుగా పాల్గొనేందుకు ఆన్‌లైన్‌లో Online tickets టికెట్లను నేటి నుంచి విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 17న సీతారాముల వారి కల్యాణం, 18న మహా పట్టాభిషేకం వేడుకల్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాల కోసం మార్చి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ వేడుకల్లో పాల్గొనాలని భావించే భక్తులు ఆన్‌లైన్‌లో ముందే టికెట్లు  Ticketsబుక్‌ చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.

భద్రాచలం సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి సందర్భంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు, ప్రత్యక్షంగా కళ్యాణం, పట్టాభిషేక కార్యక్రమాలను వీక్షించేందుకు సెక్టార్‌ టికెట్లను సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించారు.

శ్రీరామనవమి రోజు ఉభయ దాతల సేవా టికెట్‌ రుసుము రూ.7,500గా నిర్ణయించారు. ఈ టిక్కెట్‌పై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లపై ఒక్కరికి ప్రవేశం కల్పిస్తారు.

18వ తేదీన జరిగే పట్టాభిషేక మహోత్సవం సెక్టార్‌ టికెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.100గా నిర్ణయించారు. ఈ సేవల టిక్కెట్లను భద్రాద్రి ఆలయ వెబ్‌సైట్ https://bhadradritemple.telangana.gov.in/fservices/index.php?sid=1 వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చని ఈవో రమాదేవి తెలిపారు.

స్వామి వారి కల్యాణం రోజున ప్రత్యక్షంగా రాలేని భక్తులు పరోక్ష పద్ధతిలో తమ గోత్రనామాలతో పూజ చేయించే వెసులుబాటునూ కూడా కల్పించారు. దీని కోసం రూ.5 వేలు, రూ.1116 టికెట్లనూ వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ ద్వారా సీతారాముల కళ్యాణం సెక్టార్‌ టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు ఏప్రిల్‌ 1 నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు రామాలయ కార్యాలయంలో టిక్కెట్లు పొందాల్సి ఉంటుంది. టిక్కెట్ బుక్‌ చేసుకున్న వారు తానీషా కల్యాణ మండపంలో ఒరిజినల్‌ ఐడీ కార్డులను చూపించి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది.

ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి నుంచి భద్రాచలం రామాలయం, తానీషా కల్యాణ మండపం, గోదావరి బ్రిడ్జి సెంటర్‌లోని ఆలయ విచారణ కేంద్రం, ఆర్డీవో కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లలో నేరుగా టికెట్లను విక్రయించనున్నారు. ఈ సదుపాయాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.