FCRI Hyderabad : అట‌వీ క‌ళాశాల‌, ప‌రిశోధ‌న సంస్థ‌లో ప్ర‌వేశాల‌ు - నోటిఫికేష‌న్ విడుద‌ల‌, ముఖ్య తేదీలివే-applications invited for admission into bsc honours of fcri hyderabad for ay 202324 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Fcri Hyderabad : అట‌వీ క‌ళాశాల‌, ప‌రిశోధ‌న సంస్థ‌లో ప్ర‌వేశాల‌ు - నోటిఫికేష‌న్ విడుద‌ల‌, ముఖ్య తేదీలివే

FCRI Hyderabad : అట‌వీ క‌ళాశాల‌, ప‌రిశోధ‌న సంస్థ‌లో ప్ర‌వేశాల‌ు - నోటిఫికేష‌న్ విడుద‌ల‌, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 10, 2023 07:01 AM IST

Konda Laxman Bapuji Horticulture University: అట‌వీ క‌ళాశాల‌, ప‌రిశోధ‌న సంస్థ‌లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 2023-24 విద్యాసంవత్స‌రానికి సంబంధించి బీఎస్సీ(ఆన‌ర్స్‌)లో ప్ర‌వేశాల‌ు కల్పించనున్నారు. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొన్నారు.

అట‌వీ క‌ళాశాల‌, ప‌రిశోధ‌న సంస్థ‌లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌
అట‌వీ క‌ళాశాల‌, ప‌రిశోధ‌న సంస్థ‌లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

Forest College and Research Institute Hyderabad: అట‌వీ క‌ళాశాల‌, ప‌రిశోధ‌న సంస్థ‌లో ప్ర‌వేశాల‌కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ. 2023-24 సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా బీఎస్సీ(ఆన‌ర్స్‌)లో ప్ర‌వేశాలు కల్పించనున్నారు. ముఖ్య వివరాల కోసం www,fcrits.in వెబ్‌సైట్‌ చూడాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎంసెట్ లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు ఇస్తారు.

ముఖ్య తేదీలు - వివరాలు

వర్శిటీ - శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ

పూర్తి స్థాయి నోటిఫికేషన్ - జూన్ 12, 2023.

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - జూన్ 14, 2023.

దరఖాస్తులకు చివరి తేదీ - జూలై 12, 2023.

ఫైన్ తో గడువు - 15-07-2023

దరఖాస్తుల సవరణకు అవకాశం - 18-07-2023

మెరిట్ జాబితా తేదీ - 24-07-2023

తొలి విడత సీట్ల కేటాయింపు - 01-08-2023

సీట్ల కేటాయింపు ప్రకటన - 07-08-2023

ఫీజు చెల్లింపు తేదీలు - 14-08-2023

తరగతులు ప్రారంభం - 21-08-2023

జూన్ 14వ తేదీ నుంచి జులై 12వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు రూ. 1000, ఇత‌రులు రూ. 2000 చెల్లించాలి. ఆల‌స్య రుసుం రూ. 500 చెల్లించి జులై 15వ తేదీ లోపు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆగస్టులో తరగతులు ప్రారంభం అవుతాయి.

డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

Professor Jayashankar Agricultural University Admissions: అగ్రికల్చర్ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కీలక అలర్ట్ ఇచ్చింది ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం. 2023-24 సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వ్యవసాయ, సేంద్రియ, ఇంజినీరింగ్‌ విభాగాల్లో డిప్లొమా కోర్సుల పూర్తి వివరాలు, విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ www.pjtsau.edu.in  లో పొందుపరిచింది. దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభం కాగా... అభ్యర్థులు ఈ నెల 26లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

దరఖాస్తుల్లో ఏమైనా సవరణలు ఉంటే... జూన్ 27, 28 తేదీల్లో చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా డిప్లోమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్ల కోర్సు), డిప్లోమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (రెండేళ్ల కోర్సు), డిప్లోమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేళ్ల కోర్సు)ల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అన్నీ కోర్సులు కూడా ఇంగ్లీష్ మాధ్యమంలోనే ఉంటాయి. పాలిసెట్ - 2023లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఈ కోర్సుల్లో సీట్లు కేటాయిస్తారు. విద్యార్థుల వయసు తప్పనిసరిగా 15 ఏళ్ల పూర్తి కావాలి. ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు రుసుం 600 ఉండగా... మిగతా వారికి రూ. 1200గా నిర్ణయించారు.

IPL_Entry_Point