TG MHSRB Jobs 2024 : వైద్యారోగ్యశాఖలో 732 ఉద్యోగాలు - దరఖాస్తులకు రేపే ఆఖరు తేదీ!
తెలంగాణ వైద్యారోగ్యశాఖ విడుదలైన ఫార్మాసిస్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నడుస్తోంది. ఈ గడువు రేపటితో(అక్టోబర్) పూర్తి కానుంది. మొత్తం 732 ఫార్మాసిస్ట్ పోస్టులు ఉన్నాయి. మరోవైపు స్టాఫ్ నర్స్ దరఖాస్తులను అక్టోబర్ 21,22 తేదీల్లో ఎడిట్ చేసుకోవచ్చు.
తెలంగాణ వైద్యారోగ్యశాఖ నుంచి వరుస నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తులు పూర్తి కాగా… ఫార్మాసిస్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొత్తం 732 ఫార్మాసిస్ట్ గ్రేడ్ - 2 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తులు రేపటితో(అక్టోబర్ 21) ముగియనున్నాయి. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అక్టోబర్ సాయంత్రం 5 లోపు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
వైద్యారోగ్యశాఖ ముందుగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం… ముందుగా 633 ఖాళీలను పేర్కొన్నారు. కానీ ఇటీవలే ఖాళీగా ఉన్న మరో 99 ఫార్మాసిస్ట్ పోస్టులను కూడా ప్రభుత్వం జత చేసింది. ఫలితంగా ఫార్మాసిస్ట్ గ్రేడ్ - 2 ఉద్యోగాల సంఖ్య 732కి చేరింది. ఫార్మాసిస్ట్ పోస్టుల ఆన్ లైన్ దరఖాస్తులు కూడా అక్టోబర్ 21వ తేదీతో ముగియనున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు పెంచే అవకాశం లేదని తెలుస్తోంది.
దరఖాస్తులు పూర్తి తర్వాత ఏమైనా తప్పులు ఉంటే అక్టోబర్ 23, 24 తేదీల్లో ఆన్ లైన్ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. స్టాఫ్ నర్స్ పరీక్షలు నవంబర్ 23వ తేదీన జరగనున్నాయి. ఇక ఫార్మాసిస్ట్ ఉద్యోగ రాత పరీక్షలు నవంబర్ 30న నిర్వహించనున్నారు.
https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిజేసే వారికి వెయిటేజ్ కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫార్మసీ పూర్తి చేయటంతో పాటు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో నమోదు చేసుకొని ఉండాలి. అభ్యర్ధులు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 ఏళ్లకు మించి ఉండకూడదు.
NOTE : ఫార్మాసిస్ట్ గ్రేడ్ - 2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు లింక్ - https://pharmacist.tgmhsrb.in/registration/