Telugu News Updates 04 February : అసెంబ్లీ సమావేశాలు - సభలో MIM వర్సెస్ బీఆర్ఎస్-ap and telangana telugu live news updates 4 february 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telugu News Updates 04 February : అసెంబ్లీ సమావేశాలు - సభలో Mim వర్సెస్ బీఆర్ఎస్

ఏపీ తెలంగాణ తాజా వార్తలు

Telugu News Updates 04 February : అసెంబ్లీ సమావేశాలు - సభలో MIM వర్సెస్ బీఆర్ఎస్

12:06 PM ISTFeb 04, 2023 05:36 PM HT Telugu Desk
  • Share on Facebook
12:06 PM IST

  • తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీన ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గవర్నర్‌ ప్రసంగించారు. రాష్ట్ర ప్రగతిని వివరించారు. ఇక రెండో రోడు సభ ప్రారంభమైంది. గవర్నర్‌ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ మొదలైంది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఎమ్మెల్యే సండ్ర సభ ముందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు ప్రసంగించారు. మండలిలో కూడా గవర్నర్‌ ‍ప్రసంగంపై ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్ గౌడ్.. ధన్యవాద తీర్మానం పెట్టారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

Sat, 04 Feb 202312:06 PM IST

ప్యాకేజీ

IRCTC Tourism Alleppey Tour Package: వేర్వురు అందమైన ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి కేరళలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ. ఈ ట్రిప్ లో భాగంగా అలెప్పీ అందాలను వీక్షిస్తారు. అంతేకాదు మున్నార్ కూడా కవర్ అవుతుంది.

Hyderabad Alleppey tour: 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ఫిబ్రవరి 14వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు.

Sat, 04 Feb 202310:08 AM IST

పిల్లి కిడ్నాప్

Three People Arrested for Kidnapping Cat: ఓ పెంపుడు పిల్లిపై కన్నేశారు కొందరు వ్యక్తులు..! అనుకున్నట్లే ఓ టైం చూసుకొని కిడ్నాప్ చేసేశారు. అంతేనా... ఆ పిల్లిని కాస్త చంపటమే కాదు... ఏం చక్కగా తినేశారు. ఇదీ పోలీస్ స్టేషన్ వరకు చేరటంతో సదరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ఈ షాకింగ్ ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.

Sat, 04 Feb 202310:08 AM IST

బీజేపీపై ఫైర్

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై పలువురు సభ్యులు మాట్లాడారు. ఈ క్రమంలో బీజేపీ తరపున ఎమ్మెల్యే రఘనందన్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం పలు విమర్శలు చేశారు.తెలంగాణ ప్రభుత్వానికి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రావాల్సినవి, చేయాల్సిన అన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం అందిస్తోందన్నారు. గవర్నర్‌ తమిళిసై చేసిన బడ్జెట్‌ ప్రసంగంలోనూ కేంద్రాన్ని విమర్శించే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు లేకపోవడం కూడా ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వీటిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. రఘనందన్ పై సెటైర్లు విసిరారు. కేంద్రం ప్రభుత్వం తరపున మాట్లిడన వకీల్ సాబ్ ప్రసంగంలో ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు.

Sat, 04 Feb 202307:20 AM IST

ఎంఐఎం వర్సెస్ బీఆర్ఎస్

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శాసనసభ వేదికగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ కీలక వ్యాఖ్యలు  చేశారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగాన్ని కేబినెట్‌ ఆమోదించిందా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి విధానాలను అసలు పొందురపరచలేదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

Sat, 04 Feb 202306:57 AM IST

కానిస్టేబుల్ అరెస్ట్

అతను ఏఆర్ కానిస్టేబుల్...! ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే పెట్రోలింగ్ విధుల్లో ఉండగా... సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. జీతాల విషయంలో కానిస్టేబుల్ దూషణలు చేశాడు. ఇదంతా కూడా ఓ వ్యక్తి రికార్డ్ చేయగా... సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదీ కాస్త ఉన్నతాధికారుల దృష్టికి చేరటంతో... చర్యలు చేపట్టారు. సదరు కానిస్టేబుల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Sat, 04 Feb 202305:02 AM IST

అగ్నిప్రమాదం… 

రామంతపూర్‌లోని ఓ ఫర్నీచర్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. అయితే భారీగా మంటలు చెలరేగడంతో.. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. మరోవైపు గౌడౌన్ లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది.

Sat, 04 Feb 202304:46 AM IST

దరఖాస్తులు

TSPSC Group 4 Applications: గ్రూప్ 4 పరీక్షకు సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీలో దరఖాస్తుల గడువు ముగిసింది. జూలై 1వ తేదీన పరీక్ష జరగనుంది. ఈ పోస్టులకు 9 లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి.

Sat, 04 Feb 202304:46 AM IST

కేసు 

Nellore Rural MLA Kotamreddy Sridhar reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కేసు నమోదైంది. వేపడారుపల్లికి చెందిన 22వ డివిజన్‌ కార్పొరేటరు విజయభాస్కర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో వేదాయపాళెం పోలీసులు శుక్రవారం రాత్రి చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యేతో పాటూ ఆయన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్‌, కారు డ్రైవరు అంకయ్యలపై సెక్షన్‌ 448, 363ల కింద కిడ్నాప్‌కు ప్రయత్నించారని కేసు నమోదు చేశారు.

Sat, 04 Feb 202304:45 AM IST

రెండో  రోజు

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీన ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గవర్నర్‌ ప్రసంగించారు. రాష్ట్ర ప్రగతిని వివరించారు. ఇక రెండో రోడు సభ ప్రారంభమైంది. గవర్నర్‌ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ మొదలైంది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఎమ్మెల్యే సండ్ర సభ ముందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు ప్రసంగించారు. మండలిలో కూడా గవర్నర్‌ ‍ప్రసంగంపై ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్ గౌడ్.. ధన్యవాద తీర్మానం పెట్టారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.