Karimnagar TTD Temple: కరీంనగర్‌లో టీటీడీ ఆలయానికి భూమి కేటాయింపు..-allotment of land for construction of ttd temple in karimnagar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Ttd Temple: కరీంనగర్‌లో టీటీడీ ఆలయానికి భూమి కేటాయింపు..

Karimnagar TTD Temple: కరీంనగర్‌లో టీటీడీ ఆలయానికి భూమి కేటాయింపు..

HT Telugu Desk HT Telugu
May 16, 2023 11:07 AM IST

Karimnagar TTD Temple: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం భూమిని కేటాయించింది. మే 31న కరీంనగర్‌లో ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

టీటీడీ ‍ఛైర్మన్ సుబ్బారెడ్డికి  భూమి పత్రాలను అందచేస్తున్న తెలంగాణ ప్రజాప్రతినిధులు
టీటీడీ ‍ఛైర్మన్ సుబ్బారెడ్డికి భూమి పత్రాలను అందచేస్తున్న తెలంగాణ ప్రజాప్రతినిధులు

Karimnagar TTD Temple: టీటీడీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. మే 31న భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో తిరుమల ఆలయం తరహాలో కరీంనగర్‌లో ఆలయాన్ని నిర్మించనున్నారు. 31 ఉదయం 7.26 గంటలకు శాస్త్రోక్తంగా భూమిపూజ చేయనున్నారు.

కరీంనగర్‌లో ఆలయ నిర్మాణం కోసం కొద్దికాలంగా మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. జిల్లా నాయకుల విజ్ఞప్తితో పదెకరాల భూమి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించడంతో టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి మంత్రి గంగుల, వినోద్‌కుమార్‌లు భూమి పత్రాలను అందజేశారు. కరీంనగర్‌లో తిరుమల తరహాలో శ్రీవేంకటేశ్వరుడి ఆలయాన్ని నిర్మిస్తామని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

ఆలయ నిర్మాణం కోసం భూమిపూజ నిర్వహించే ప్రాంగణంలో మే 31 సాయంత్రం తిరుమల అర్చక పండితులు శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారని తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం వేద పండితులు, స్థపతులతో చర్చించి, ఆలయ నమూనాను పరిశీలించేందుకు వినోద్‌కుమార్‌, టీటీడీ తెలంగాణ సలహా కమిటీ ఛైర్మన్‌ భాస్కర్‌రావులతో కలిసి త్వరలో తిరుమలకు వెళ్లనున్నట్లు మంత్రి తెలిపారు.

ఆగమశాస్త్రం ప్రకారం కరీంనగర్‌ పద్మనగర్‌లో నిర్మించే శ్రీవేంకటేశ్వరసామి ఆలయ అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయ నిర్మాణాల నమూనాలతో పాటు మూల విరాట్, పోటు, ప్రసాద వితరణ కేంద్రం తదితర అంశాలను తెలంగాణ బృందం పరిశీలిస్తుందని చెప్పారు.

IPL_Entry_Point