TSPSC AEE Exam : రేపు ఏఈఈ రాత పరీక్ష.... సీబీటీ విధానంలో ఎగ్జామ్, హాల్ టికెట్ లింక్ ఇదే-all set for tspsc aee exam on 8th may 2023 check hall tickets links at here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Aee Exam : రేపు ఏఈఈ రాత పరీక్ష.... సీబీటీ విధానంలో ఎగ్జామ్, హాల్ టికెట్ లింక్ ఇదే

TSPSC AEE Exam : రేపు ఏఈఈ రాత పరీక్ష.... సీబీటీ విధానంలో ఎగ్జామ్, హాల్ టికెట్ లింక్ ఇదే

HT Telugu Desk HT Telugu
May 07, 2023 01:22 PM IST

TSPSC Latest News: రేపటి ఏఈఈ పరీక్షకు సర్వం సిద్ధం చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పటికే హాల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఏఈఈ పరీక్ష
ఏఈఈ పరీక్ష

TSPSC AEE Updates: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు...కూపీని బయటికి లాగే పనిలో పడింది. ఇప్పటివరకు 22 మందిని అరెస్ట్ చేసింది. మరోవైపు ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే... మరోవైపు రద్దు అయిన పరీక్షల నిర్వహణపై ఫోకస్ పెట్టింది టీఎస్పీఎస్సీ. ఇప్పటికే పలు పరీక్షల తేదీలను ప్రకటించగా... మరికొన్ని తేదీలను కూడా ప్రకటించాలని చూస్తోంది. అయితే రేపు(మే 8,9) అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) రాత పరీక్షను నిర్వహించుంది. ఇందుకోసం టీఎస్‌పీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

మే 8, 9 తేదీల్లో వివిధ శాఖల్లోని అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ పరీక్షలను నిర్వహించనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. హాల్‌ టికెట్లను మే 2వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ tspsc.gov.in. నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకు కూడా అభ్యర్థులు వీటిని డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. 100 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (అగ్రికల్చర్‌) పోస్టులకు సోమవారం, 97 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌) ఉద్యోగాలకు 9న పరీక్షలు నిర్వహించనుంది. మరోవైపు మే 21, 22 తేదీల్లో 1,343 సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఉద్యోగాలకు ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 1,540 ఏఈఈ ఉద్యోగాలకు గతేడాది సెప్టెంబర్‌ 3న నోటిఫికేషన్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 22న పరీక్ష జరిగగా.... ప్రశ్నపత్రాల లీకేజీతో సంస్థ పరీక్షను రద్దు చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ సారి జరగబోయే పరీక్షలన్నీ ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహించనున్నారు.

హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి...

అభ్యర్థులు మొదటగా https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

AEE హాల్ టికెట్లు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

TSPSC ID, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.

మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ పరీక్షల తేదీల్లో మార్పులు…

మరోవైపు పలు పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్.ఈ నెల 13న జరగాల్సిన పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ నియామక పరీక్షను రీషెడ్యూల్‌ చేసింది. ఈ పరీక్షను తిరిగి సెప్టెంబర్‌ 4 నుంచి 8వ తేదీ మధ్యలో నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 247 పాలిటెక్నిక్ లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఈ నెల 17న జరగాల్సిన ఇంటర్, సాంకేతిక విద్యా శాఖల్లో ఫిజికల్ డైరెక్టర్ల నియామక పరీక్షను కూడా రీషెడ్యూల్ చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ ఎగ్జామ్ ను సెప్టెంబర్ 11వ తేదీన నిర్వహించనున్నట్లు వివరించింది..

IPL_Entry_Point

సంబంధిత కథనం