UIDAI Jobs: హైదరాబాద్ యూఐడీఏఐలో ఉద్యోగాలు.. వివరాలివే
హైదరాబాద్ షాద్‌నగర్‌లోని యూఐడీఏఐ కేంద్రంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టుల వివరాలు, ఖాళీలు, జీతభత్యాల వివరాలు ఇలా ఉన్నాయి....
UIDAI Hyderabad Recruitment 2022: హైదరాబాద్ షాద్‌నగర్‌లోని యూఐడీఏఐ కేంద్రంలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 3 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఉద్యోగాల దరఖాస్తుకు ఈనెల 27ను చివరి తేదీగా పేర్కొన్నారు.
అర్హతలివే...
బీఈ/ బీటెక్/ కంప్యూటర్ సైన్స్/ ఈసీఈ/ జియో ఇన్ఫర్మేటిక్స్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వెబ్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్, ప్రాజెక్ట్ ప్లానింగ్ లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి
జీతం - ఏడాదికి 9 లక్షల ప్యాకేజీ
ఈ లింక్ క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. దీని ద్వారా అప్లయ్ కూడా చేసుకోవచ్చు.
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ - జూన్ 27, 2022