Team India Players at Perth: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు.. ఏం చేశారో తెలుసా?-team india players ashwin dinesh karthik and chahal unique way to gear up for t20 world cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Team India Players At Perth: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు.. ఏం చేశారో తెలుసా?

Team India Players at Perth: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు.. ఏం చేశారో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Oct 11, 2022 07:36 AM IST

Ashwin Unique way to Chill: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన సహచర ఆటగాళ్లతో కలిసి పెర్త్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20కి హాజరయ్యారు. అశ్విన్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

<p>రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్</p>
రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్ (Twitter)

Team India Players at Perth: టీ20 వరల్డ్ కప్ 2022 సమరం దగ్గరపడుతోంది. మరికొన్ని రోజుల్లో పొట్టి ప్రపంచకప్‌లో తలపడేందుకు భారత్ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కోసం ఆస్ట్రేలియా చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. అయితే ఆదివారం కావడంతో చిల్ భారత ప్లేయర్లలో కొంతమంది చిల్ అయ్యారు. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టీ20కి హాజరయ్యారు. రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, హర్షల్ పటేల్ ఈ మ్యాచ్ చూసేందుకు పెర్త్ స్టేడియానికి వెళ్లారు.

వీరు మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫొటోను అశ్విన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కార్తిక్, చాహల్, హర్షల్‌తో కలిసి ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ టీ20 చూస్తూ వీరు చిల్ అవుతున్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ తొలి టీ20ని ఆదివారం ఆడాయి. ఈ మ్యాచ్‌ను నిశితంగా గమనిస్తూ మరింత మెరుగ్గా తన ప్రణాళికలను రచించేందుకు అశ్విన్ వ్యూహ రచనలు చేస్తున్నాడు. నేర్చుకునేందుకు ఎక్కువగా అశ్విన్ ఆసక్తి చూపిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే.

ఈ రెండు జట్ల బలాలు, బలహీతనలు నిశితంగా గమనించిన అశ్విన్.. ఆటను చూస్తూనే మరోపక్క సహచరులతో చిల్ అవుతున్నాడు. ఇతరులు కూడా ఈ రెండు జట్ల గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.

పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అలక్స్ హేల్స్(84), జాస్ బట్లర్(68) అర్ధశతకాలతో అదరగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆస్ట్రేలియా విఫలమైంది. డేవిడ్ వార్నర్(73 అర్ధసెంచరీతో పోరాడినప్పటికీ అతడొక్కడి పోరాటం విజయానికి సరిపోలేదు. ఫలితంగా పరాజయం తప్పలేదు.

Whats_app_banner

సంబంధిత కథనం