Kohli can get Sachin Record: సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడు.. భారత మాజీ జోస్యం-sunil gavaskar says virat kohli can get 100 international centuries ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kohli Can Get Sachin Record: సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడు.. భారత మాజీ జోస్యం

Kohli can get Sachin Record: సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడు.. భారత మాజీ జోస్యం

Maragani Govardhan HT Telugu
Jan 16, 2023 06:56 AM IST

Kohli can get Sachin Record: అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్న 100 సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తాడని సునీల్ గవాస్కర్ స్పష్టం చేశారు. మరో 5-6 ఏళ్లు ఇలాగే ఆడితే.. ఇది తప్పకుండా సాధ్యమవుతుందని తెలిపారు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (AP)

Kohli can get Sachin Record: టీమిండియా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ.. ఆదివారం నాడు శ్రీలంకతో జరిగిన మూడోదైన చివరి వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అద్భుత శతకంతో(166) విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా భారత్ 317 పరుగుల భారీ తేడా ఘనవిజయం సాధించింది. అంతేకాకుండా సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తనదైన శైలి బ్యాటింగ్‌తో పాత విరాట్‌ను గుర్తు చేస్తూ వరుసగా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు కోహ్లీ. ఈ సెంచరీతో వన్డేల్లో 46వ శతకాన్ని పూర్తి చేసుకోగా.. మొత్తంగా 74వ అంతర్జాతీయ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడిపై స్వర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) కూడా కోహ్లీ ఆటతీరుపై ఆనందం వ్యక్తం చేశారు. ఇలాగే ఆడితే సచిన్ 100 సెంచరీల రికార్డు బద్దలుకొడతాడని స్పష్టం చేశారు.

"విరాట్ కోహ్లీ (Virat Kohli)ఇలాగే మరో 5-6 ఏళ్లు ఆడితే.. సచిన్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. సగటును ఏడాదికి 6 శతకాలు చేసినా.. ఆ రికార్డు సాధ్యమవతుంది. కాబట్టి మరో 5 నుంచి 6 ఏళ్లలో అతడు తప్పకుండా సెంచరీని నమోదు చేస్తాడు. అది కూడా అతడు 40 ఏళ్ల వరకు ఆడగలిగితేనే." అని సునీల్ గవాస్కర్ తెలిపారు.

కోహ్లీ ఫిట్‌నెస్ చూస్తుంటే 40 ఏల్ల వరకు ఆడతాడనడంలో ఎలాంటి ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదని గవాస్కర్ స్పష్టం చేశారు. "సచిన్ తెందూల్కర్ 40 ఏళ్ల వరకు ఆడాడు. అతడు అలానే తన ఫిట్‌నెస్ కాపాడుకున్నాడు. కోహ్లీకి కూడా తన ఫిట్‌నెస్ గురించి బాగా తెలుసు. అతడు ఇప్పటికీ వికెట్ల మధ్యన వేగంగా పరుగులు తీస్తున్నాడు. అతడితో పాటు ధోనీ ఉండుంటే ఆ విషయం మీకే బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ధోనీ చాలా వేగంగా ఉంటాడు. కోహ్లీ అంత వేగంగా ఉన్నాడు కాబట్టి కుర్రాళ్లతో దీటుగా వికెట్ల మధ్య పరుగులు తీస్తున్నాడు. డబుల్స్, త్రిబుల్స్‌ను కూడా సునాయసంగా చేస్తున్నాడు. కాబట్టి 40 ఏళ్ల వరకు కోహ్లీ ఫిట్‌గా ఉంటాడనంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు" అని గవాస్కర్ అన్నారు.

విరాట్ కోహ్లీ గత 6 నెలల కాలంలో నాలుగు శతకాలు నమోదు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్న అతడు 2023 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు. వన్డేల్లో సచిన్ సెంచరీల(49) రికార్డును సమం చేసేందుకు ఇంకో 3 శతకాల దూరంలో ఉన్నాడు. మొత్తంగా సచిన్ 100 సెంచరీల రికార్డును అందుకునేందుకు ఇంకో 26 శతకాలు చేయాల్సి ఉఁది. తెందూల్కర్ టెస్టుల్లో 51, వన్డేల్లో 49 శతకాలు చేసి మొత్తంగా 100 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. మరోపక్క విరాట్ వన్డేల్లో 46, టెస్టుల్లో 27, టీ20ల్లో ఒక శతకంతో 74 అంతర్జాతీయ సెంచరీలు పూర్తి చేశాడు.

Whats_app_banner

సంబంధిత కథనం