IND Vs SL 1st ODI : సచిన్ రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ
India Vs Sri Lanka, 1st ODI : స్వదేశంలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు. గౌహతిలోని బర్సాపరా స్టేడియంలో విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
వన్డే కెరిర్లో విరాట్ కోహ్లీ 45వ సెంచరీని నమోదు చేశాడు. స్వదేశంలో అత్యధిక వన్డే సెంచరీలు 20 చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. గౌహతిలోని బర్సాపరా స్టేడియంలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో వన్డేల్లో ఈ ఘనత సాధించాడు కోహ్లీ. సచిన్, కోహ్లి ఇద్దరికీ 20 సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో 153 మ్యాచ్‌ల్లో 13 సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు.
ట్రెండింగ్ వార్తలు
ఇక మూడు ఫార్మాట్లలో చూసుకుంటే.. కింగ్ కోహ్లీకి ఇది 73వ సెంచరీ. వన్డేల్లో టెస్టుల్లో 27, టీ20ల్లో సెంచరీ సాధించాడు. తాజాగా స్వదేశంలో 20 వన్డే సెంచరీలు చేశాడు. దీంతో లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. శ్రీలంకతో తొలి వన్డేలో ఈ ఘనత సాధించాడు. వేగంగా 12500 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 45 వన్డే సెంచరీతో కోహ్లీ ఇప్పుడు శ్రీలంకపై తొమ్మిది సెంచరీలు చేశాడు.
స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ సరసన కోహ్లీ నిలిచాడు. శ్రీలంకతో జరిగిన మెుదటి వన్డేలో 80 బంతుల్లోనే కోహ్లీ సెంచరీ చేశాడు. స్వదేశంలో 20 సెంచరీలు చేయడానికి.. సచిన్ 160 ఇన్నింగ్స్ ఆడితే.., కోహ్లీ 102 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.
కోహ్లీతోపాటుగా రోహిత్, శుభ్‌మన్ హాఫ్ సెంచరీలు చేయడంతో ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగుల భారీ స్కోరు చేసింది. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇండియా 400 మార్క్‌ను అందుకోలేకపోయింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) మంచి ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ తొలి వికెట్‌కు 143 రన్స్ జోడించిన తర్వాత గిల్ ఔటయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన విరాట్ మొదటి నుంచీ చాలా కాన్ఫిడెంట్‌గా ఆడాడు. చివరికి 87 బంతుల్లోనే 113 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
సంబంధిత కథనం