Steyn about Sanju Samson: యువీలో ఉన్న సత్తా సంజూలో ఉంది.. ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టగలడు: స్టెయిన్‌-steyn about sanju samson says he has ability of yuvraj singh and can hit six sixes ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Steyn About Sanju Samson: యువీలో ఉన్న సత్తా సంజూలో ఉంది.. ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టగలడు: స్టెయిన్‌

Steyn about Sanju Samson: యువీలో ఉన్న సత్తా సంజూలో ఉంది.. ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టగలడు: స్టెయిన్‌

Hari Prasad S HT Telugu
Oct 07, 2022 12:12 PM IST

Steyn about Sanju Samson: యువరాజ్‌ సింగ్‌లో ఉన్న సత్తా సంజూ శాంసన్‌లో ఉందని అన్నాడు సౌతాఫ్రికా మాజీ పేస్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌. అతడు ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టగలడని కూడా చెప్పాడు.

సంజూ శాంసన్, యువరాజ్ సింగ్
సంజూ శాంసన్, యువరాజ్ సింగ్ (ANI/File)

Steyn about Sanju Samson: ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి వన్డేలో సంజూ శాంసన్‌ చెలరేగిన సంగతి తెలుసు కదా. తనకు అప్పుడప్పుడూ వస్తున్న అవకాశాలను సంజూ సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు సౌతాఫ్రికాపై 40 ఓవర్లలో 250 రన్స్‌ చేజింగ్‌లోనూ సంజూ 63 బాల్స్‌లోనే 86 రన్స్‌ చేసి మరోసారి అటు మాజీ క్రికెటర్లు, ఇటు అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఈ మ్యాచ్‌లో ఇండియా విజయం కోసం 30 రన్స్‌ అవసరం కాగా.. సంజూ 20 రన్స్‌ చేయడం విశేషం. షంసి వేసిన ఆ ఓవర్లో ఒక సిక్స్‌, మూడు ఫోర్లు బాదాడు. మరో రెండు షాట్ల దూరంలో నిలిచిపోయానని, అయితే తన ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నట్లు శాంసన్‌ మ్యాచ్‌ తర్వాత చెప్పాడు. అయితే ఈ థ్రిల్లింగ్‌ మ్యాచ్‌పై ఇప్పుడు సౌతాఫ్రికా మాజీ పేస్‌ బౌలర్‌ డేల్ స్టెయిన్‌ కూడా స్పందించాడు.

సంజూ శాంసన్‌ ఆడిన తీరుకు స్టెయిన్‌ ఫిదా అయిపోయాడు. అతని బ్యాటింగ్‌ను తాను ఐపీఎల్‌లోనే చూశానని, యువరాజ్‌లో ఉన్న సత్తా అతనిలో ఉన్నదని స్టెయిన్‌ అన్నాడు. 39వ ఓవర్లో కగిసో రబాడా నోబాల్‌ వేయడం తనను ఆందోళనకు గురి చేసిందని చెప్పాడు.

"కేజీ (కగిసో రబాడా) తన ఓవర్‌ చివరి బంతికి నోబాల్‌ వేసిన సయమంలో ఇలా జరగకూడదని నేను ప్రార్థించాను. ఎందుకంటే సంజూ శాంసన్‌లాంటి బ్యాటర్‌, అతడున్న ఫామ్‌లో ఏదైనా జరగొచ్చు. అతన్ని నేను ఐపీఎల్‌లోనూ చూశాను. బౌలర్లపై విరుచుకుపడటం, సులువగా బౌండరీలు బాదడం.. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లలో చెలరేగిపోతాడు" అని స్టెయిన్‌ అన్నాడు.

ఈ సందర్భంగా సంజూని యువరాజ్‌తో పోల్చాడు స్టెయిన్‌. సంజూ కూడా ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు బాదగలడని అభిప్రాయపడ్డాడు. "షంసి చివరి ఓవర్‌ వేయబోతున్నాడు. అతను బంతితో దారుణంగా విఫలమయ్యాడని సంజూకి తెలుసు. రబాడా నోబాల్‌ వేసినప్పుడు నేను ఆందోళనకు గురయ్యాను. సంజూలో యువీలో ఉన్న సత్తా ఉంది. ఆరు సిక్స్‌లు కొట్టగలడు. టీమ్‌కు 30+ రన్స్‌ అవసరమైనా గెలిపించగలడు" అని స్టెయిన్‌ అన్నాడు.