Father's Day: ఫాదర్స్‌ డే నాడు తన కొడుకు పేరు రివీల్‌ చేసిన యువరాజ్‌-yuvraj singh revealed his sons name on the occasion of fathers day ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Yuvraj Singh Revealed His Sons Name On The Occasion Of Fathers Day

Father's Day: ఫాదర్స్‌ డే నాడు తన కొడుకు పేరు రివీల్‌ చేసిన యువరాజ్‌

భార్య హేజెల్, కొడుకు ఓరియన్ తో యువరాజ్ సింగ్
భార్య హేజెల్, కొడుకు ఓరియన్ తో యువరాజ్ సింగ్ (Twitter)

యువరాజ్‌ సింగ్‌ ఫాదర్స్‌ డే నాడు తన కొడుకు పేరు రివీల్‌ చేశాడు. యువీ, హేజెల్‌ కీచ్‌ జంటకు ఈ ఏడాది జనవరిలో కొడుకు పుట్టిన విషయం తెలిసిందే.

న్యూఢిల్లీ: తనకు కొడుకు పుట్టిన సుమారు ఆరు నెలలకు యువరాజ్‌ అతనికి పేరు పెట్టాడు. ఆదివారం ఫాదర్స్‌ డే సందర్భంగా ఈ పేరును అతడు బయటకు వెల్లడించడం విశేషం. ట్విటర్‌ ద్వారా యువీ ఈ విషయం చెప్పాడు. హ్యాపీ ఫాదర్స్‌ డే అని చెబుతూ.. యువరాజ్‌ తన కొడుకుకు ఓరియన్‌ కీచ్‌ సింగ్‌ అనే పేరు పెట్టినట్లు తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు

యువరాజ్‌, హేజెల్‌ కీచ్‌లకు గత జనవరిలో కొడుకు పుట్టాడు. ఓరియన్‌ అనేది ఓ నక్షత్ర మండలం పేరు కాగా ఆ తర్వాత తల్లి ఇంటి పేరు అయిన కీచ్‌, ఆ తర్వాత తన ఇంటి పేరు సింగ్‌ను జోడించాడు. ట్విటర్‌లో తాను, హేజెల్‌, ఓరియన్‌ ఫొటోను పోస్ట్‌ చేస్తూ యువరాజ్‌ ఈ పేరును వెల్లడించాడు. రెండేళ్ల కిందట క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువీ.. ప్రస్తుతం ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లలో ఆడుతున్నాడు.

ఇండియన్‌ క్రికెట్‌లో స్టైలిష్‌ ప్లేయర్‌గా యువీకి పేరుంది. అతడు ఎన్నో మ్యాచ్‌లలో ఇండియాను గెలిపించాడు. 2007లో తొలి టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమ్‌లో ఉన్నాడు. ఆ వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఆరు సిక్స్‌లు బాదిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2011లో వన్డే వరల్డ్‌ కప్‌ విజయంలో అతనిదే కీలకపాత్ర. ఆ మెగా టోర్నీలో అతడు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్