Anant Ambani Wedding: అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ గెస్టుల కోసం వేసిన ఖరీదైన డేరాలు ఎలా ఉన్నాయో చూశారా? సైనా వీడియో ఇదీ-saina nehwal shares the inside look of tents for guests of anant ambani radhika merchant wedding ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Anant Ambani Wedding: అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ గెస్టుల కోసం వేసిన ఖరీదైన డేరాలు ఎలా ఉన్నాయో చూశారా? సైనా వీడియో ఇదీ

Anant Ambani Wedding: అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ గెస్టుల కోసం వేసిన ఖరీదైన డేరాలు ఎలా ఉన్నాయో చూశారా? సైనా వీడియో ఇదీ

Hari Prasad S HT Telugu
Mar 01, 2024 07:00 PM IST

Anant Ambani Wedding: అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ ఈవెంట్ల కోసం వచ్చే గెస్టుల కోసం జామ్ నగర్ లో ఫైవ్ స్టార్ హోటల్స్ లేకపోవడంతో ఖరీదైన టెంట్లు వేశారు. వీటి లోపల ఎలా ఉందో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తాజా వీడియోలో చూపించింది.

అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ గెస్టుల కోసం ఏర్పాటు చేసిన టెంటులో సైనా నెహ్వాల్
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ గెస్టుల కోసం ఏర్పాటు చేసిన టెంటులో సైనా నెహ్వాల్

Anant Ambani Wedding: భారత కుబేరుడు ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లంటే మాటలా? అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ కోసం వచ్చే అతిథుల కోసమే ఖరీదైన ఏసీ డేరాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసేశారు. ఈ పెళ్లి గుజరాత్ లోని జామ్ నగర్ లో జరుగుతుండటం, అక్కడ ఫైవ్ స్టార్ హోటల్స్ లేకపోవడంతో ఈ ఏర్పాటు చేశారు. వీటి లోపల ఎంత విలాసవంతంగా ఉందో తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ షేర్ చేసిన వీడియో చూస్తే తెలుస్తుంది.

yearly horoscope entry point

అంబానీ గెస్టుల కోసం వేసిన టెంట్లు ఇవే

ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి జులై 12న జరగనుంది. అయితే దానికి ముందు ప్రస్తుతం నాలుగు రోజుల పాటు గుజరాత్ లోని జామ్ నగర్ లో ప్రీవెడ్డింగ్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. అయితే దీనికోసమే అంబానీ ఫ్యామిలీ డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెడుతోంది. దీనికోసం వచ్చే గెస్టులకు జామ్ నగర్ లో ఖరీదైన లగ్జరీ టెంట్లను వేశారు.

ఆ టెంట్లు కూడా ఎంత విలాసవంతంగా ఉన్నాయో తాజాగా సైనా నెహ్వాల్ చూపించింది. శుక్రవారం (మార్చి 1) ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోలో ఈ టెంట్స్ ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఈ ప్రీవెడ్డింగ్ ఈవెంట్స్ కోసం దేశ, విదేశాల నుంచి ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, ప్రపంచ కుబేరులు వస్తుండటంతో అందుకు తగినట్లే ఏర్పాట్లు చేశారు.

జామ్ నగర్లో సైనా నెహ్వాల్

ఈ ప్రీవెడ్డింగ్ కోసం బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కూడా అక్కడికి వెళ్లింది. అక్కడ తనకు కేటాయించిన టెంట్ ఎలా ఉందో ఆమె చూపించింది. పేరుకే టెంట్లు కానీ.. ఓ ఖరీదైన హోటల్ రూమ్ లో ఉండే వసతులన్నీ ఇక్కడ ఏర్పాటు చేసినట్లు ఆ వీడియో చూస్తే స్పష్టమవుతోంది. ఏసీలు, టీవీలు, మంచాలు.. ఇలా అతిథులకు ఏ లోటూ లేకుండా వాటిని నిర్మించారు.

గెస్టులు ఈవెంట్స్ కోసం రెడీ అయ్యేందుకు కూడా అందులోనూ ప్రత్యేకంగా ఓ రూమ్ ఏర్పాటు చేశారు. అందులో మేకప్ సామగ్రి మొత్తం అందుబాటులో ఉంటుంది. ఇలాంటి కొన్ని వందల టెంట్లు అక్కడ ఏర్పాటు చేశారు. వీటికోసమే అంబానీ కుటుంబం కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది. అంతేకాదు మొత్తం ఈ ప్రీవెడ్డింగ్ తంతు కోసమే ఏకంగా రూ.1250 కోట్లకుపైగా ఖర్చు చేస్తుండటం గమనార్హం.

మూడు రోజుల పాటు జరగబోయే ఈ ప్రీవెడ్డింగ్ ఈవెంట్స్ కోసం ఏకంగా 2500 రకాల ప్రత్యేక వంటకాలు సిద్ధం చేస్తున్నారు. వీటిని చేయడానికి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి 65 మంది ఛెఫ్ లు జామ్ నగర్ వెళ్లారు. ఇందులో భారతీయ వంటకాలతోపాటు థాయ్, మెక్సికన్, జపనీస్, సౌత్ ఏషియన్ వంటకాలు కూడా ఉండనున్నాయి.

Whats_app_banner