Ambani’s wedding: ‘‘నా చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి విషయంలో నావి రెండే ముఖ్యమైన కోరికలు’’ - నీతా అంబానీ-nita ambani shares 2 important wishes she has for son anants wedding ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ambani’s Wedding: ‘‘నా చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి విషయంలో నావి రెండే ముఖ్యమైన కోరికలు’’ - నీతా అంబానీ

Ambani’s wedding: ‘‘నా చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి విషయంలో నావి రెండే ముఖ్యమైన కోరికలు’’ - నీతా అంబానీ

HT Telugu Desk HT Telugu
Mar 01, 2024 02:56 PM IST

Ambani’s wedding: దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘వెడ్డింగ్ ఆఫ్ ద ఈయర్’ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహానికి సంబంధించి తన ముఖ్యమైన రెండు ఆకాంక్షలను నీతా అంబానీ శుక్రవారం వెలిబుచ్చారు. ఈ పెళ్లి విషయంలో తన కోరికలను వెల్లడిస్తూ ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

చిన్న కొడుకు అనంత్ అంబానీ, కాబోయే కోడలు రాధిక మర్చంట్ తో నీతా అంబానీ
చిన్న కొడుకు అనంత్ అంబానీ, కాబోయే కోడలు రాధిక మర్చంట్ తో నీతా అంబానీ (PTI)

Anant Ambani wedding: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం మరో పారిశ్రామిక వేత్త కుటుంబానికి చెందిన రాధిక మర్చంట్ తో త్వరలో జరగనుంది. ఈ వివాహానికి సంబంధించిన ప్రి వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

yearly horoscope entry point

నీతా అంబానీ వీడియో

ఈ సందర్భంగా, తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం విషయంలో తనకు ఉన్న రెండు ముఖ్యమైన కోరికలను ఎక్స్ (twitter) వేదికగా, ఒక వీడియో ద్వారా నీతా అంబానీ వెలిబుచ్చారు. రాధిక మర్చంట్ తో తన చిన్న కుమారుడి వివాహం విషయానికి వస్తే తనకు ‘రెండు ముఖ్యమైన కోరికలు’ ఉన్నాయని ఈ వీడియోలో నీతా అంబానీ వెల్లడించారు. ‘‘రాధికతో నా చిన్న కుమారుడు అనంత్ వివాహం విషయానికి వచ్చినప్పుడు, నాకు రెండు ముఖ్యమైన కోరికలు ఉన్నాయి. వాటిలో మొదటిది, నేను మా మూలాల నుంచి సంప్రదాయబద్ధంగా వేడుక జరగాలని అనుకున్నాను. రెండవది, ఈ వేడుక మన కళలు, సంస్కృతికి నివాళిగా ఉండాలని నేను కోరుకున్నాను’’ అని ఆ వీడియోలో నీతా పేర్కొన్నారు. కొన్ని గంటల క్రితం ఈ పోస్ట్ ను షేర్ చేశారు. అప్పటి నుంచి ఈ వీడియోను 3.1 లక్షలకు పైగా వీక్షించారు. ఈ వీడియోకు 5,100 లైక్స్ వచ్చాయి. నీతా అంబానీ వీడియోపై స్పందిస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియోపై ఎక్స్ యూజర్లు ఎలా స్పందించారు?

"మేము మా మూలాలను సెలబ్రేట్ చేసుకున్నప్పుడు, మేము మా సంప్రదాయాలను మరియు భారతీయతను జరుపుకుంటాము" అని ఒక ఎక్స్ యూజర్ రాశారు. "ఇది అద్భుతంగా ఉంది" అని మరొకరు అన్నారు. భారతదేశాన్ని ప్రపంచానికి చూపి, దాని గొప్ప వారసత్వం మరియు సంస్కృతిని ప్రదర్శించడం మంచి ఉద్దేశం’ అని మరో యూజర్ స్పందించాడు. ఇది కేవలం పెళ్లి మాత్రమే కాదని, భారతదేశాన్ని 'డెస్టినేషన్ వెడ్డింగ్'గా పరిగణిస్తున్నందుకు ప్రపంచానికి ఇచ్చిన సాహసోపేతమైన ప్రకటన అని ఆ యూజర్ పేర్కొన్నారు.

ఈ రోజు నుంచి ప్రి వెడ్డింగ్ వేడుకలు..

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ వేడుకలు (Anant Ambani and Radhika Merchant pre-wedding festivities) ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఇవి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు భారతదేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు గుజరాత్ లోని జామ్ నగర్ కు చేరుకున్నారు. జులైలో ఈ జంట పెళ్లి పీటలెక్కనుంది.

Whats_app_banner