Rishabh Pant: పంత్ మా టీమ్‌లో అయితే సరిగ్గా సరిపోతాడు: ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్
Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. అతడు తమ టీమ్‌కైతే సరిగ్గా సరిపోతాడని అనడం విశేషం.
లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో టీమిండియా ఓడిపోయినా.. ఇందులో టీమ్‌కు ఊరట కలిగించే విషయం రిషబ్ పంత్. టెస్టుల్లో తన దూకుడైన ఆటతీరు కొనసాగించిన పంత్.. తొలి ఇన్నింగ్స్‌లో 146, రెండో ఇన్నింగ్స్‌లో 57 రన్స్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక దశలో 98 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయిన టీమ్ 416 పరుగుల భారీ స్కోరు సాధించిందంటే దానికి కారణం పంతే.
అతని ఆట ఇండియన్ ఫ్యాన్స్‌కే కాదు.. ప్రత్యర్థి ఇంగ్లండ్ కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్‌కు కూడా బాగా నచ్చింది. పంత్ ఇన్నింగ్స్‌కు ఆకాశానికెత్తిన స్టోక్స్.. అతడు తమ టీమ్‌కు సరిగ్గా సరిపోతాడని అన్నాడు. "ఇప్పుడున్న పరిస్థితుల్లో రిషబ్ పంత్ మా టీమ్‌కు సరిగ్గా సరిపోతాడు. అతడు ఆడుతున్న విధానం అలా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో అతడు ఆడిన తీరు అద్భుతం. ఆ ఇన్నింగ్స్‌ను నేను బాగా ఎంజాయ్ చేశాను. మాపైనే అతడు అలా ఆడుతున్నా.. చూడటానికి మాత్రం చాలా బాగా అనిపించింది. గతంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పుడిలా ఆడుతుండటం గొప్ప విషయం" అని స్టోక్స్ అన్నాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ ఆడే విధానాన్నే మార్చేసిన విషయం తెలిసిందే. దూకుడైన బ్యాటర్‌గా పేరున్న బ్రెండన్ మెకల్లమ్ కోచ్‌గా వచ్చిన తర్వాత ఆ దూకుడు ఇంగ్లండ్ టీమ్‌లోనూ కనిపిస్తోంది. వరుసగా నాలుగు టెస్టుల్లో భారీ స్కోర్లను చేజ్ చేసి ఆ టీమ్ గెలిచింది. ఈ దూకుడైన ఆటతీరును ఉద్దేశించే రిషబ్ పంత్ తమ టీమ్‌కు సరిగ్గా సరిపోతాడని స్టోక్స్ అనడం విశేషం.
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ ముగిసిన తర్వాత ఇక ఇప్పుడు రిషబ్ పంత్.. టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. విరాట్ కోహ్లి, బుమ్రాలతో కలిసి రెండో టీ20 మ్యాచ్ నుంచి పంత్ అందుబాటులోకి రానున్నాడు.
సంబంధిత కథనం