Rahul Dravid: ద్రవిడ్ కరోనా నుంచి కోలుకోకుంటే ఆసియా కప్ కోచ్ ఎవరో తెలుసా?-rahul dravid tests covid positive a head of asia cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rahul Dravid: ద్రవిడ్ కరోనా నుంచి కోలుకోకుంటే ఆసియా కప్ కోచ్ ఎవరో తెలుసా?

Rahul Dravid: ద్రవిడ్ కరోనా నుంచి కోలుకోకుంటే ఆసియా కప్ కోచ్ ఎవరో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Aug 23, 2022 08:39 PM IST

టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు అందుబాటులో ఉండేది లేది అనుమానంగా మారింది. రాహుల్ ద్రవిడ్ అందుబాటులో లేకపోతే జింబాబ్వేతో సిరీస్‌కు కోచింగ్‌గా బాధ్యతలు తీసుకున్న వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

<p>రాహుల్ ద్రవిడ్</p>
రాహుల్ ద్రవిడ్ (AFP)

టీమిండియా సభ్యులను కరోనా మహమ్మారి వదలడం లేదు. కొన్ని రోజుల క్రితం కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి స్టార్ ఆటగాళ్లు కరోనా బారిన పడగా.. తాజాగా భారత కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ధ్రువీకరించింది. కరోనా కారణంగా ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జట్టుతో కలిసే అవకాశముంది. రాహుల్ ద్రవిడ్ అందుబాటులో లేకపోతే జింబాబ్వేతో సిరీస్‌కు కోచింగ్‌గా బాధ్యతలు తీసుకున్న వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆసియా కప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది.

"టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆసియా కప్ 2022 కోసం యూఏఈకి వెళ్లేముందు ఆయనకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో బీసీసీఐ వైద్య బృందం జరిపిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన జట్టుతో తిరిగి కలిసే అవకాశముంది. మిగిలిన జట్టు సభ్యులు మంగళవారం నాడు యూఏఈకి ప్రయాణమయ్యారు." అని బీసీసీఐ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ 15వ ఎడిషన్ టోర్నమెంట్ యూఏఈ వేదికగా ఆరుజట్లతో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఇప్పటివరకు అత్యధిక సార్లు ఆసియా కప్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఏడు సార్లు ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. గత ఎడిషన్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించగా.. ఈ సారి మాత్రం టీ20 ఫార్మాట్‌లో జరగనుంది.

ఆసియా కప్‌లో ఆడనున్న భారత జట్టు..

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, రవి భిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్హదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్.

Whats_app_banner

సంబంధిత కథనం