Olympics India Day 1 Schedule: ఒలింపిక్స్‌లో భారత్ ఫస్ట్ డే షెడ్యూల్ - షూటర్లు బోణీ కొడతారా?
Paris Olympics India Day 1 Schedule: తొలిరోజు ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్, షూటింగ్, హకీతో పాటు పలు ఈవెంట్స్‌లో భారత్ పోటీపడనుంది. షూటింగ్‌లో మెడల్ ఈవెంట్స్ జరుగనున్నాయి.
Paris Olympics India Day 1 Schedule: పారిస్ ఒలింపిక్స్‌లో మొదటి రోజు బ్యాడ్మింటన్, హాకీ, షూటింగ్‌తో పాటు పలు ఈవెంట్స్‌లో ఇండియా పోటీపడుతోంది. షూటింగ్‌లో పతకం లక్ష్యంగా తొలిరోజు భారత అథ్లెట్లు బరిలోకి దిగబోతున్నారు. మరో వైపు ఒలింపిక్స్ తొలి పతకం ఏ దేశానికి చెందిన అథ్లెట్ గెలుస్తాడన్నది క్రీడాభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
హాకీ...ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
హాకీలో తన తొలి మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. గ్రూప్ బీలో భాగంగా జరుగున్న ఈ మ్యాచ్‌లో భారత్‌కు కఠిన పరీక్ష ఎదురుకాబోతోంది. తొలి మ్యాచ్‌లోనే బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటూ భారత్ ఏ మేరకు విజయం సాధిస్తుందన్నది చూడాల్సిందే. రాత్రి 9 గంటల నుంచి ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ మొదలుకానుంది. గత ఒలింపిక్స్ లో భారత హాకీ టీమ్ కాంస్య పతకాన్ని గెలిచింది.
షూటింగ్..
పది మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ పోటీల్లో భారత్ నుంచి సందీప్‌సింగ్ - వలరీవాన్, అర్జున్ - రమితా జిందాల్ పోటీపడబోతున్నారు. మెన్స్, ఉమెన్స్ రెండు విభాగాల్లో నేడు పోటీలు జరుగనున్నాయి. మెడల్ విన్నర్స్ ను నేడు ప్రకటించనున్నారు.
ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో సరబ్‌జోత్, అర్జున్ చీమా, మను బాకర్, రిథమ్ సాంగ్వాన్ పోటీపడనున్నారు.
టెన్నిస్
టెన్నిస్ డబుల్స్‌లో ఫస్ట్ రౌండ్ పోటీలు శనివారం జరుగనున్నాయి. డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీతో కలిసి బరిలో దిగబోతున్నాడు.
బ్యాడ్మింటన్ పోటీలు...
బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో ఫస్ట్ డే సింగిల్స్, డబుల్స్ పోటీల్లో ఇండియా తన అదృష్టాన్నీ పరీక్షించుకోబోతున్నది. మెన్స్ సింగిల్స్‌లో కామన్‌వెల్త్ విజేత లక్ష్య సేన్...మెన్స్ డబుల్స్‌లో చిరాక్ శెట్టి - సాత్విక్ రాజ్, ఉమెన్స్ డబుల్స్ లో తానిషా - అశ్విని పొన్నప్ప తొలి రోజు ఎలాంటి ఫలితాలు ఎదుర్కొంటారన్నది చూడాల్సిందే.
టేబుల్ టెన్సిస్‌లో హర్మత్ దేశాయ్, బాక్సింగ్‌లో 54 కేజీల విభాగంలో ప్రీతీ తొలి రౌండ్ అడ్డంకిని దాటుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఒలింపిక్స్ ఈవెంట్స్ ను జియో సినిమాతో పాటు సోర్ట్స్ 18లో లైవ్‌లో చూడొచ్చు.