తెలుగు న్యూస్ / ఫోటో /
Paris Olympics 2024: ఘనంగా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు - ఈవెంట్‌కు హాజరైన రామ్‌చరణ్
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఓపెనింగ్ ఈవెంట్ పరేడ్‌ను పారిస్‌లోని సెన్ నదిపై వినూత్నంగా నిర్వహించారు. ఒలింపిక్ గేమ్స్ ఆరంభ వేడుకలలో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ పాల్గొన్నాడు.
(1 / 6)
పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో ఇండియన్ అథ్లెట్లు ట్రెడిషనల్ డ్రెస్సుల్లో మెరిశారు. ఈ ఓపెనింగ్ ఈవెంట్‌లో 177 మందికి 78 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. భారత అథ్లెట్ల బృందానికి సింధు, శరత్ కమల్ ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు (via REUTERS)
(2 / 6)
పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ ఈవెంట్‌కు పాప్ సింగర్ లేడీ గాగా మ్యూజికల్ షో హైలైట్‌గా నిలిచింది. ఫ్రెంచ్ వైభవాన్నీ చాటిచెప్పే సాంగ్స్‌తో ఆహుతుల్ని అలరించింది. (AFP)
(3 / 6)
పారిస్ ఒలింపిక్స్ఆరంభ వేడుకల్లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ పాల్గొన్నాడు. ఓపెనింగ్ ఈవెంట్‌తో ఒలింపిక్ క్రీడల అధికారికంగా ప్రారంభమైనట్లు మేక్రాన్ ప్రకటించాడు. (AP)
(4 / 6)
పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ ఈవెంట్‌లో ఒలింపిక్ టార్చ్ పట్టుకొని టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ ఎంట్రీ ఇచ్చిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. (AP)
(5 / 6)
ఒపెనింగ్ ఈవెంట్‌లో అథ్లెట్ల పరేడ్‌ను స్టేడియంలో కాకుండా పారిస్‌లోని సెన్ నదిపై నిర్వహించారు. ఈ పరేడ్‌లో గ్రీస్ దేశం తొలుత ఎంట్రీ ఇవ్వగా ఇండియా 84 దేశంగా పరేడ్‌లో పాల్గొన్నది. (AP)
ఇతర గ్యాలరీలు