Olympics Archery: ఆర్చరీ క్వార్టర్ ఫైనల్లో ఇండియా.. తొలి రోజే వరల్డ్ రికార్డు నమోదు
- Olympics Archery: ఒలింపిక్స్ 2024 ఆర్చరీలో ఇండియన్ టీమ్ నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరింది. నాలుగో స్థానంలో నిలిచి క్వార్టర్స్ చేరినా.. అక్కడ మాత్రం సౌత్ కొరియా ముప్పు పొంచి ఉంది.
- Olympics Archery: ఒలింపిక్స్ 2024 ఆర్చరీలో ఇండియన్ టీమ్ నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరింది. నాలుగో స్థానంలో నిలిచి క్వార్టర్స్ చేరినా.. అక్కడ మాత్రం సౌత్ కొరియా ముప్పు పొంచి ఉంది.
(1 / 7)
Olympics Archery: పారిస్ ఒలింపిక్స్ తొలి రోజే సౌత్ కొరియా ఆర్చర్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఆ దేశానికి చెందిన లిమ్ షియోన్ వుమెన్స్ వ్యక్తిగత ర్యాంకింగ్స్ రౌండ్ లో 694 పాయింట్లు సాధించింది. తన దేశానికి చెందిన చేయంగ్ కాంగ్ 2019లో క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేసింది.
(2 / 7)
Olympics Archery: వ్యక్తిగత ర్యాంకింగ్స్ రౌండ్లలో ఇండియన్ ఆర్చర్లు నిరాశ పరిచారు. అంకితా భక్త 11వ స్థానంలో నిలిచింది. భజన్ కౌర్, దీపికా కుమారి అయితే 22, 23 స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఇండియా మొత్తంగా 1983 పాయింట్లు సాధించింది.
(3 / 7)
Olympics Archery: టీమ్ ఈవెంట్లో సౌత్ కొరియా తొలి స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో మెక్సికో రాగా.. నాలుగో స్థానంలో ఇండియా ఉంది. క్వార్టర్ ఫైనల్లో ఇండియన్ టీమ్ ఫ్రాన్స్ లేదా నెదర్లాండ్స్ తో పోటీ పడే అవకాశం ఉంది. అయితే అక్కడ గెలిచినా.. సెమీస్ లో మాత్రం సౌత్ కొరియా గండం పొంచి ఉంది. వుమెన్స్ టీమ్ ఈవెంట్లో ఇప్పటి వరకూ కొరియా ఒక్క ఈవెంట్ కూడా ఓడిపోకపోవడం గమనార్హం. ఒకవేళ సెమీస్ లో ఇండియా ఓడితే బ్రాంజ్ మెడల్ కోసం తలపడాల్సి ఉంటుంది.
(4 / 7)
Olympics Archery: ఇండియా నాలుగో స్థానంలో నిలవడం వల్లే సెమీస్ లో కొరియా ఎదురయ్యే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ మూడో స్థానం వచ్చి ఉంటే ఫైనల్ వరకూ ఆ టీమ్ ఎదురయ్యేది కాదు. అలా అయితే కనీసం ఏదో ఒక మెడల్ ఖాయమయ్యేది. ఇప్పుడు సెమీస్ లో ఆ జట్టును ఓడించడం ఇండియాకు సవాలే.
(5 / 7)
Olympics Archery: ఇక ర్యాంకింగ్స్ రౌండ్ లో ముగ్గురు ఇండియన్ వుమెన్ ఆర్చర్లు ఉండగా.. దీపికా కుమారి అందరి కంటే దిగువన ఉండటం గమనార్హం. తొలి రౌండ్ తర్వాత ఆమె 327 పాయింట్లతో 37వ స్థానంలో నిలిచింది. రెండో రౌండ్లో 331 పాయింట్లు సాధించి 23వ స్థానానికి చేరింది.
(6 / 7)
Olympics Archery: మరో ఆర్చర్ అంకిత తొలి రౌండ్లోనే మంచి స్టార్ట్ అందుకుంది. ఒక దశలో నాలుగో స్థానానికి చేరినా.. తర్వాత 11వ స్థానానికి పడిపోయింది. తొలి రౌండ్లో 335, రెండో రౌండ్లో 331 పాయింట్లు.. మొత్తంగా 666 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది.
ఇతర గ్యాలరీలు