Jadeja, Rohit Review: చెత్త రివ్యూ.. అంపైరే నవ్వుకున్నాడు.. జడేజా, రోహిత్ పరువు పోయింది.. వీడియో
Jadeja, Rohit Review: చెత్త రివ్యూ ఇది. ఏకంగా అంపైరే నవ్వుకున్నాడు. జడేజా, రోహిత్ తీసుకున్న డీఆర్ఎస్ నిర్ణయంతో వాళ్ల పరువు పోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Jadeja, Rohit Review: డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)ను సరిగ్గా వాడుకోవడం కూడా ఒక కళే. గతంలో ధోనీ కెప్టెన్ గా ఉన్న సమయంలో దీనిని ఎలా వాడాలో చేసి చూపించాడు. కానీ కొంతమంది కెప్టెన్లు, బౌలర్లు మాత్రం ఇప్పటికీ డీఆర్ఎస్ ను సరిగా వాడుకోవడం రావడం లేదు. దీనికి తాజా ఉదాహరణ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా. ఈ ఇద్దరూ కలిసి నాలుగో టెస్ట్ రెండో రోజు ఆటలో తీసుకున్న రివ్యూ ఒకటి మరీ చెత్తగా ఉంది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 128వ ఓవర్లో ఇది జరిగింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఎలాగైనా ఔట్ చేయాలన్న పట్టుదలతో కనిపించిన జడేజా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ తోసిపుచ్చాడు. ఆఫ్ స్టంప్ కు చాలా బయట ఖవాజా ప్యాడ్స్ ను బంతి తగిలింది. అతడు అసలు షాట్ ఆడటానికి ప్రయత్నించకపోవడంతో జడేజాతోపాటు చుట్టూ ఉన్న ఫీల్డర్లు గట్టిగా అప్పీల చేశారు.
ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో నాటౌట్ ఇచ్చాడు. కానీ జడేజా మాత్రం డీఆర్ఎస్ తీసుకోవాల్సిందిగా కెప్టెన్ రోహిత్ పై ఒత్తిడి తెచ్చాడు. అయితే తీరా రీప్లేల్లో చూస్తే బంతి ఆఫ్ స్టంప్ కు చాలా దూరంగా వెళ్తున్నట్లు తేలింది. ఇది చూసి ప్లేయర్స్ సహా అంపైర్ కూడా నవ్వుకోవడం విశేషం. వికెట్ కాదు కదా.. ఓ రివ్యూను కూడా ఇండియన్ టీమ్ కోల్పోయింది.
ఈ రివ్యూపై అప్పుడు కామెంట్రీ ఇస్తున్న రవిశాస్త్రి, దినేష్ కార్తీక్ కూడా స్పందించారు. ఈ రివ్యూపై కార్తీక్ మరీ ఘాటుగా స్పందించాడు. అసలు థర్డ్ అంపైర్ మేల్కొనే ఉన్నాడా లేదా అని తేల్చుకోవడానికి ఈ రివ్యూ ఇండియన్ టీమ్ తీసుకున్నట్లుందని కార్తీక్ అనడం విశేషం. ఆస్ట్రేలియా తరఫున ఖవాజా, గ్రీన్ ఐదో వికెట్ కు ఏకంగా 208 పరుగులు జోడించారు.
టెస్టుల్లో తొలి సెంచరీ చేసిన గ్రీన్ 114 పరుగులు చేసి ఔటవగా.. ఖవాజా 180 రన్స్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా స్కోరు 400 దాటింది. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా.. ఒక్కో ఆస్ట్రేలియా వికెట్ తీయడానికి తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది.
సంబంధిత కథనం