Yashasvi Huge IPL Feat: రాజస్థాన్ యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ అద్భుత ఫామ్‌తో అదరగొడుతోన్న సంగతి తెలిసిందే. తన యూనిక్ బ్యాటింగ్ శైలితో మెరుగైన ప్రదర్శన చేస్తూ దూసుకెళ్తున్నాడు. యశస్వీ ఇటీవల పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీతో రాణించాడు. 36 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా 138 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక స్ట్రైక్ రేటుతో 600కి పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 48.07 సగటుతో 625 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం సహా ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 124 పరుగులు చేశాడు. అంతేకాకుండా 163.61 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసాడు. ఫలితంగా 600 కంటే ఎక్కువ ఐపీఎల్ పరుగులు చేసి అత్యధిక స్ట్రైక్ రేటు కలిగిన బ్యాటర్ల సరసన యశస్వీ నిలిచాడు. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందు క్రిస్ గేల్ ఉన్నాడు, రిషబ్ పంత్, డివిలియర్స్ ఉన్నారు.
క్రిస్ గేల్ 2011 ఐపీఎల్ సీజన్‌లో 183.13 స్ట్రైక్ రేటుతో 608 పరుగులు చేయగా.. పంత్ 2018 సీజన్‌లో 173.6 స్ట్రైక్ రేటుతో 684 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ 2016 ఐపీఎల్ సీజన్‌లో 168.8 స్ట్రైక్ రేటుతో 687 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.
పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అధ్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 4 వికెట్ల తేడాతో గెలిచింది. యశస్వీ జైస్వాల్, దేవదత్ పడిక్కల్ అర్ధ సెంచరీతో విజృంభించగా.. షిమ్రన్ హిట్మైర్ మెరుపులు మెరిపించాడు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఆకట్టుకునే ప్రదర్శనతో విజయాన్ని అందుకుంది. పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడా 2 వికెట్లు తీయగా.. సామ్ కరన్, అర్ష్‌దీప్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.