Steve Smith in IPL 2023: స్మిత్ వచ్చేస్తున్నాడు.. పండగ చేసుకుంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్యాన్స్-steve smith in ipl 2023 as the australia batter confirms his participation in the league ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Steve Smith In Ipl 2023: స్మిత్ వచ్చేస్తున్నాడు.. పండగ చేసుకుంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్యాన్స్

Steve Smith in IPL 2023: స్మిత్ వచ్చేస్తున్నాడు.. పండగ చేసుకుంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్యాన్స్

Hari Prasad S HT Telugu
Mar 27, 2023 04:55 PM IST

Steve Smith in IPL 2023: స్మిత్ వచ్చేస్తున్నాడు. ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ మరోసారి ఐపీఎల్లో అడుగుపెడుతున్నాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Steve Smith; KKR fans
Steve Smith; KKR fans

Steve Smith in IPL 2023: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రెండేళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్లోకి వస్తున్నాడు. 2022 సీజన్ కు ముందు వేలంలో స్మిత్ ను ఎవరూ కొనుగోలు చేయలేదు. ఆ తర్వాత గతేడాది చివర్లో జరిగిన మినీ వేలం నుంచి స్మిత్ తప్పుకున్నాడు. అయితే తాజాగా సోమవారం (మార్చి 27) తాను ఐపీఎల్ కు వస్తున్నట్లు స్మిత్ చెప్పి ఆశ్చర్యపరిచాడు.

ఈ మేరకు అతడు తన ట్విటర్ అకౌంట్ లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. "నమస్తే ఇండియా. మీకోసం ఉత్సాహపరిచే న్యూస్ తీసుకొచ్చాను. నేను ఐపీఎల్ 2023కు వస్తున్నాను. ఇండియాలో ఓ అద్భుతమైన టీమ్ తో చేరబోతున్నాను" అని స్మిత్ అన్నాడు. ఆ టీమేదో అతడు చెప్పకపోయినా.. కోల్‌కతా నైట్ రైడర్స్ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.

స్మిత్ చివరిసారి 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకూ స్మిత నాలుగు ఫ్రాంఛైజీలకు ఆడాడు. 2012లో తొలిసారి పుణె వారియర్స్ టీమ్ తో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత రెండు సీజన్ల పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడాడు. 2016లో రెండు సీజన్ల పాటు రాజస్థాన్ టీమ్ ను సస్పెండ్ చేయడంతో స్మిత్ రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తో చేరాడు. 2017లో కెప్టెన్ గా ఆ జట్టును ఫైనల్ కు తీసుకెళ్లాడు.

2019లో రాజస్థాన్ కు తిరిగి వచ్చిన అతడు.. 2020లో కెప్టెన్ అయ్యాడు. స్మిత్ ఇప్పటి వరకూ ఐపీఎల్లో 103 మ్యాచ్ లు ఆడి 2485 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇప్పుడు రెండు సీజన్ల తర్వాత ఐపీఎల్ కు తిరిగి వస్తున్నా ఏ జట్టుకు ఆడబోతున్నాడో తెలియడం లేదు. కానీ కోల్‌కతా నైట్ రైడర్స్ అభిమానులు మాత్రం అతడు తమ టీమ్ లోనే చేరతాడని అనుకుంటున్నారు.

శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో ప్రస్తుతం కేకేఆర్ కు కెప్టెన్ లేడు. దీంతో స్మిత్ తమ జట్టులోకి వస్తే కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలన్న ఆందోళన ఉండదు. మరోవైపు స్మిత్ ఐపీఎల్లోకి వస్తున్నా.. కామెంటరీ బాక్స్ లో కూర్చోవచ్చన్న వార్తలు కూడా వస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం