Sreesanth on Ganguly vs Kohli: కోహ్లీ సెంచరీ గంగూలీకి పర్ఫెక్ట్ నివాళి.. శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Sreesanth on Ganguly vs Kohli: శనివారం నాడు దిల్లీ-బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి గంగూలీకి గొప్ప ట్రిబ్యూట్ ఇవ్వాలని అన్నాడు. కోహ్లీ-గంగూలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న తరుణంలో శ్రీశాంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Sreesanth on Ganguly vs Kohli: టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ వరుస వివాదాల్లో చికుక్కుంటున్నాడు. ఇటీవలే మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌తో మాటల యుద్ధం పెద్ద గొడవకే దారి తీసింది. దీంతో ఇరువురు ఆటగాళ్లకు జరిమానా కూడా విధించింది బిసీసీఐ. అంతకుముందు కోహ్లీ, బీసీసీఐ మాజీ ఛీఫ్ సౌరవ్ గంగూలీ మధ్య కూడా చిన్నపాటి సంఘర్షణ నెలకొంది. ఇటీవల వీరిద్దరూ తమ ఇన్‌స్టాలో ఒకరికొకరు అన్ ఫాలో చేసుకోవడమే కాకుండా ఇద్దరూ ఎదురుపడినప్పటికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండా ఎవరికి వారు వెళ్లిపోయారు. తాజాగా గంగూలీ-కోహ్లీ అంశంపై శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శనివారం నాడు దిల్లీతో జరగబోయే మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేసి గంగూలీ గొప్ప ట్రిబ్యూట్ ఇవ్వాలని కోరాడు.
"విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం చూడాలనుకుంటున్నా. ఇది దాదాకు గొప్ప నివాళి అవుతుందని నేను భావిస్తున్నా. కోహ్లీ మైదానంలోకి వెళ్లి మీ భావాలను వ్యక్తపరచండి. ఆర్సీబీ గెలుపు కోసం ఆడండి. అంటూ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు." అతడు మాట్లాడిన ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ ట్విటర్ వేదికగా షేర్ చేసింది.
దిల్లీ-బెంగళూరు మధ్య శనివారం జరగనున్న మ్యాచ్ రసవత్తరంగా ఉంటుందని శ్రీశాంత్ అన్నాడు. కోహ్లీ-వార్నర్ మధ్య జరిగే పోరు ఆసక్తికరంగా ఉంటుందని తెలిపాడు. "విరాట్ కోహ్లీ Vs డేవిడ్ వార్నర్ మధ్య పోరు మంచి థ్రిల్‌ను కలిగిస్తుంది. దిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడే మ్యాచ్ గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ లీగ్‌లో ఆర్సీబీ అత్యుత్తమ స్థితికి వెళ్లడానికి ఈ మ్యాచ్ ఉపయోగపడుతుంది." అని శ్రీశాంత్ తెలిపాడు.
శనివారం సాయంత్రం 7.30 గంటలకు దిల్లీ-బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. దిల్లీ అరుణ్ జైట్లీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఇరుజట్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 5వ స్థానంలో బెంగళూరు కొనసాగుతుండగా.. 3 విజయాలతో పాయింట్ల పట్టికల్లో చిట్టచివరి స్థానంలో ఉంది దిల్లీ.