Sehwag on Sachin: ఆ రోజు సచిన్ నన్ను బ్యాట్‌తో కొట్టాడు.. సెహ్వాగ్ కామెంట్స్ వైరల్-sehwag on sachin says master hit him with the bat ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sehwag On Sachin: ఆ రోజు సచిన్ నన్ను బ్యాట్‌తో కొట్టాడు.. సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

Sehwag on Sachin: ఆ రోజు సచిన్ నన్ను బ్యాట్‌తో కొట్టాడు.. సెహ్వాగ్ కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu
Apr 12, 2023 06:51 PM IST

Sehwag on Sachin: ఆ రోజు సచిన్ నన్ను బ్యాట్‌తో కొట్టాడు అంటూ సెహ్వాగ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్లో కామెంట్రీ సందర్భంగా 2011 వరల్డ్ కప్‌లో జరిగిన ఘటనను వీరూ గుర్తు చేసుకున్నాడు.

సచిన టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్
సచిన టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ (Getty)

Sehwag on Sachin: ఇండియన్ టీమ్ లో సచిన్, సెహ్వాగ్ ఓపెనింగ్ జోడీ ఎంతటి సక్సెస్ సాధించిందో మనకు తెలుసు. ముఖ్యంగా వన్డేల్లో వీళ్లది ప్రపంచంలోని బెస్ట్ ఓపెనింగ్ జోడీల్లో ఒకటి. 2003లో ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ చేరినప్పుడు, 2011లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఈ ఇద్దరే స్పెషలిస్ట్ ఓపెనర్లు. 2011లో ట్రోఫీ గెలవడంలో సచిన్ కీలకపాత్ర పోషించాడు.

అయితే ఆ వరల్డ్ కప్ లో జరిగిన ఓ సరదా ఘటన గురించి తాజాగా ఐపీఎల్లో కామెంట్రీ సందర్భంగా సెహ్వాగ్ వివరించాడు. నిజానికి ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని స్టోరీ అది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో సచిన్ తనను బ్యాట్ తో కొట్టాడని వీరూ చెప్పడం విశేషం. ఈ మ్యాచ్ లో సచిన్ సెంచరీ చేయగా.. వీరూ 73 రన్స్ చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్ మొత్తం తాను పాటలు పాడుతూ ఉండటంతో మాస్టర్ తనను బ్యాట్ తో కొట్టినట్లు చెప్పాడు.

"2011 వరల్డ్ కప్ లో మేము సౌతాఫ్రికాతో ఆడుతున్నాం. బ్యాటింగ్ చేస్తూ నేను పాటలు పాడుతున్నాను. సచిన్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. కానీ అతడు ఓవర్ల మధ్యలో మాట్లాడేవాడు. నేను మాత్రం అస్సలు మాట్లాడలేదు.

ఏకాగ్రత కోసం నేను పాటలు పాడుతూనే ఉన్నాను. మూడు ఓవర్ల పాటు ఇలా సాగింది. నాలుగో ఓవర్లో సచిన్ వెనుక నుంచి వచ్చి నన్ను బ్యాట్ తో కొట్టాడు. నువ్వు ఇలాగే పాటలు పాడుతున్నావంటే నిన్ను కిశోర్ కుమార్ చేసేస్తా అన్నాడు" అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

అది విని పక్కనే ఉన్న కామెంటేటర్లు రవిశాస్త్రి, జతిన్ సప్రు తెగ నవ్వారు. అయినా సెహ్వాగ్ అలా చెబుతూ వెళ్లిపోయాడు. "మనం బాగా బ్యాటింగ్ చేస్తున్నాం.. ఇక మాట్లాడుకోవడానికి ఏముంటుంది అని నేను అనుకున్నాను. 20 ఓవర్లలోనే 140-150 రన్స్ చేశాం. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కూడా బౌలర్లు, వాళ్ల వ్యూహాల గురించి సచిన్ మాట్లాడాలని అనుకున్నాడు. కానీ వాటిని నేను అసలు పట్టించుకోను" అని సెహ్వాగ్ చెప్పాడు.

అయితే సెహ్వాగ్ చెప్పిన ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది. ఇద్దరు ఓపెనర్లు బాగానే ఆడినా.. మిడిలార్డర్ కుప్పకూలడంతో ఇండియా 296 రన్స్ మాత్రమే చేసింది. ఆ టార్గెట్ ను సౌతాఫ్రికా రెండు బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం