World Cup Stadiums: వరల్డ్ కప్ స్టేడియాలకు కొత్త రూపు.. హైదరాబాద్ స్టేడియానికి రూ.117 కోట్లు-world cup stadiums to be revamped ahead of mega tournament ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  World Cup Stadiums: వరల్డ్ కప్ స్టేడియాలకు కొత్త రూపు.. హైదరాబాద్ స్టేడియానికి రూ.117 కోట్లు

World Cup Stadiums: వరల్డ్ కప్ స్టేడియాలకు కొత్త రూపు.. హైదరాబాద్ స్టేడియానికి రూ.117 కోట్లు

Hari Prasad S HT Telugu
Apr 11, 2023 04:13 PM IST

World Cup Stadiums: వరల్డ్ కప్ స్టేడియాలకు కొత్త రూపు ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ స్టేడియం రెనోవేషన్ కోసం రూ.117 కోట్లు చేయనుంది.

ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (PTI)

World Cup Stadiums: మరికొన్ని నెలల్లో ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరగబోతున్న విషయం తెలిసిందే. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగబోయే ఈ మెగా టోర్నీకి ముందే దేశంలోని స్టేడియాలను పూర్తిగా కొత్త లుక్ లో కనిపించేలా చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ స్టేడియాలలో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదని అభిమానులు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

దీని కోసం రూ.500 కోట్ల ఖర్చుతో ఐదు స్టేడియాలను రెనోవేట్ చేయనుంది. ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి పేరున్నా దేశంలోని క్రికెట్ స్టేడియాలు మాత్రం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వరల్డ్ కప్ కూడా ఇలాంటి స్టేడియాలలో జరిగితే బోర్డు పరువు పోతుంది. దీంతో అర్జెంట్ గా వీటి రూపు మార్చేయాలని బోర్డు భావిస్తోంది.

ఆ ఐదు స్టేడియాలకు నిధులు

ఈసారి వరల్డ్ కప్ కోసం దేశవ్యాప్తంగా 12 వేదికలను బీసీసీఐ ఎంపిక చేసింది. అందులో ఐదు స్టేడియాలకు ఇప్పుడు నిధులు కేటాయిస్తోంది. ఢిల్లీతోపాటు హైదరాబాద్, కోల్‌కతా, మొహాలి, ముంబై స్టేడియాల్లో వసతులను మెరుగుపరచనున్నారు. 2011 వరల్డ్ కప్ ఫైనల్ కు వేదికైన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో కనీస వసతులు లేవని ఓ అభిమాని ఫిర్యాదు చేయడంతో ఈ మధ్యే ఇండియా, ఆస్ట్రేలియా వన్డేకు ముందు ఆ స్టేడియాన్ని రెనోవేట్ చేశారు.

ఇక ఇప్పుడు మిగతా స్టేడియాల్లోనూ పనులు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో వసతులు మెరుగుపరచడానికి రూ.117.17 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఇక ఢిల్లీ స్టేడియానికి రూ.100 కోట్లు, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ కోసం రూ.127.47 కోట్లు, మొహాలీలోని పీసీఏ స్టేడియానికి రూ.79.46 కోట్లు, వాంఖెడే కోసం రూ.78.82 కోట్లు ఖర్చు కానుంది.

ఇక ఈ స్టేడియాల్లో రూఫ్ పనులు కూడా చేస్తే ఈ ఖర్చు మరింత పెరగనుంది. వరల్డ్ కప్ మ్యాచ్ లు హైదరాబాద్ తో పాటు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, ముంబైలలో జరగనున్నాయి. వరల్డ్ కప్ లో భాగంగా మొత్తం 48 మ్యాచ్ లు జరగనున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం