Ravi Shastri on World cup: వరల్డ్ కప్ టీమ్‌లో ఈ ముగ్గురు ఐపీఎల్ స్టార్లూ ఉంటారు: రవిశాస్త్రి-ravi shastri on world cup says those three ipl stars are contenders for world cup
Telugu News  /  Sports  /  Ravi Shastri On World Cup Says Those Three Ipl Stars Are Contenders For World Cup
యశస్వి జైస్వాల్
యశస్వి జైస్వాల్ (Sudipta Banerjee)

Ravi Shastri on World cup: వరల్డ్ కప్ టీమ్‌లో ఈ ముగ్గురు ఐపీఎల్ స్టార్లూ ఉంటారు: రవిశాస్త్రి

18 May 2023, 14:45 ISTHari Prasad S
18 May 2023, 14:45 IST

Ravi Shastri on World cup: వరల్డ్ కప్ టీమ్‌లో ఈ ముగ్గురు ఐపీఎల్ స్టార్లూ ఉంటారని రవిశాస్త్రి అన్నాడు. ఈ ఏడాది యశస్వి జైస్వాల్, రింకు సింగ్, తిలక్ వర్మ మంచి ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే.

Ravi Shastri on World cup: టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్లో మెరిసిన యశస్వి జైస్వాల్, రింకు సింగ్, తిలక్ వర్మ.. వన్డే వరల్డ్ కప్ టీమ్ పోటీలో ఉంటారని అన్నాడు. ఈ ముగ్గురూ ఆయా టీమ్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. నిజానికి యశస్విని వరల్డ్ కప్ టీమ్ లోకి తీసుకోవాలని గత కొన్ని రోజులుగా డిమాండ్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

యశస్వి ఈ ఏడాది ఇప్పటికే 575 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఈ సీజన్ లో ఓ సెంచరీ కూడా బాదాడు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ గా ఆ టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు రింకు కేకేఆర్ జట్టుకు మంచి ఫినిషర్ గా ఎదిగాడు. ఈ సీజన్ లో ఏకంగా 50.88 సగటుతో 407 రన్స్ చేయడం విశేషం. అటు ముంబై ఇండియన్స్ టీమ్ లో తిలక్ వర్మ కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు.

దీంతో ఈ ముగ్గురి ప్రదర్శనపై ఐసీసీ రివ్యూలో రవిశాస్త్రి స్పందించాడు. "ఒకరు యశస్వి జైస్వాల్. ఈ సీజన్ లో అతడు ఆడిన తీరే అది చెబుతోంది. గతేడాది కంటే అతడు ఎంతో మెరుగయ్యాడు. అది చాలా చాలా సానుకూలాంశం. ఈ ఏడాది అతడు కొడుతున్న శక్తివంతమైన షాట్లు అద్భుతం. ఇక మరో వ్యక్తి రింకు సింగ్. అతనిదో గొప్ప స్టోరీ. ఈ ఇద్దరూ చాలా శ్రమించారు. తమ వ్యక్తిగత జీవితాల్లోనూ ఎంతో కష్టపడ్డారు. వాళ్లకు ఏదీ సులువుగా దక్కలేదు. అందుకే వాళ్లలో ఆ ఆకలి, ఆట పట్ల మక్కువ కనిపిస్తుంది" అని శాస్త్రి అన్నాడు.

ఈ ఇద్దరితోపాటు తిలక్ కూడా వరల్డ్ కప్ రేసులో ఉంటారని, వాళ్లు ఇదే ఫామ్ కొనసాగిస్తే కచ్చితంగా వీళ్ల పేర్లు పరిశీలిస్తారని చెప్పాడు. "బ్యాటింగ్ విషయానికి వస్తే తిలక్ వర్మ ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జితేష్ శర్మ కూడా డేంజరస్ బ్యాటరే. గుజరాత్ టైటన్స్ సాయి సుదర్శన్ కూడా. కానీ నా వరకూ తిలక్ వర్మ, జైస్వాల్, రింకు సింగ్ ముందుంటారు. వీళ్లతోపాటు రుతురాజ్ గైక్వాడ్ కూడా వరల్డ్ టీమ్ రేసులో ఉంటారు" అని శాస్త్రి స్పష్టం చేశాడు.

సంబంధిత కథనం