Pietersen trolls Dhoni: ధోనీని ట్రోల్ చేస్తూనే ఉన్న పీటర్సన్.. మిస్టర్ కూల్ స్పందిస్తాడా?-pietersen trolls dhoni again and still no response from csk star ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pietersen Trolls Dhoni: ధోనీని ట్రోల్ చేస్తూనే ఉన్న పీటర్సన్.. మిస్టర్ కూల్ స్పందిస్తాడా?

Pietersen trolls Dhoni: ధోనీని ట్రోల్ చేస్తూనే ఉన్న పీటర్సన్.. మిస్టర్ కూల్ స్పందిస్తాడా?

Hari Prasad S HT Telugu
May 17, 2023 03:31 PM IST

Pietersen trolls Dhoni: ధోనీని ట్రోల్ చేస్తూనే ఉన్నాడు కెవిన్ పీటర్సన్. అయితే మిస్టర్ కూల్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆరేళ్ల కిందట ఐపీఎల్ సందర్భంగానే మొదలైన వీళ్ల సరదా ఫైట్ కొనసాగుతూనే ఉంది.

Pietersen and Dhoni have faced each other a number of times during their illustrious careers
Pietersen and Dhoni have faced each other a number of times during their illustrious careers

Pietersen trolls Dhoni: ఇంగ్లండ్ మాజీ స్టార్ కెవిన్ పీటర్సన్.. మరోసారి ధోనీని ట్రోల్ చేశాడు. ఈ సీజన్ ఐపీఎల్ సందర్భంగా మంగళ, బుధవారాల్లో వరుస ట్వీట్లు చేసిన కేపీ.. ధోనీపై సరదాగా కౌంటర్లు వేశాడు. ధోనీ తీసిన తొలి టెస్ట్ వికెట్ తనది కాదని ఈసారి వీడియో సాక్ష్యాన్ని కూడా బయటపెట్టాడు. నిజానికి ఈ ఇద్దరి మధ్య 2017 ఐపీఎల్ సందర్భంగా తొలిసారి సరదా ఫైట్ జరిగింది.

అప్పుడు ధోనీ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ టీమ్ తరఫున ఆడుతున్నాడు. ఆ సమయంలో మైక్ పెట్టుకొని ఫీల్డింగ్ చేస్తున్న మనోజ్ తివారీతో.. ధోనీ కంటే నేను మంచి గోల్ఫర్ ని అని పీటర్సన్ అన్నాడు. దీనికి ధోనీ రిప్లై ఇస్తూ.. నువ్వే నా తొలి టెస్ట్ వికెట్ అని అదే మైక్ ద్వారా కేపీకి సమాధానమిచ్చాడు. కానీ ఆ రోజు డీఆర్ఎస్ తో నిర్ణయాన్ని అంపైర్ వెనక్కి తీసుకున్నట్లు పీటర్సన్ గుర్తు చేశాడు.

ఇక తాజాగా మంగళవారం (మే 16) వీడియో సాక్ష్యంతో మరో ట్వీట్ చేశాడతడు. 2011లో ఇంగ్లండ్ లో ఇండియా టూర్ సందర్భంగా ఓ మ్యాచ్ లో ధోనీ బౌలింగ్ చేశాడు. అప్పుడు ఓ బాల్ అతన్ని బీట్ చేసి వికెట్ కీపర్ ద్రవిడ్ చేతుల్లో పడింది. అందరూ అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు. కానీ కేపీ వెంటనే రివ్యూ చేయడంతో అసలు బంతి.. బ్యాట్ కు తగల్లేదని తేలింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.

ఈ వీడియోనే కేపీ షేర్ చేస్తూ.. "స్పష్టమైన సాక్ష్యం ఉంది. నేను ధోనీ తొలి వికెట్ కాదు. అయినా అది మంచి బాల్ ఎమ్మెస్" అనే క్యాప్షన్ పెట్టాడు పీటర్సన్. అంతటితో ఆగకుండా బుధవారం (మే 17) మరో ట్వీట్ చేశాడు. నిజానికి తానే ధోనీ వికెట్ తీశానంటూ ఆ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ మ్యాచ్ 2007లో ఓవల్ లో జరిగింది. అప్పటికే 92 పరుగులు చేసి సెంచరీపై కన్నేసిన ధోనీని పీటర్సన్ ఔట్ చేశాడు.

అయితే ఇలా రెండు రోజులుగా పీటర్సన్ తనను ట్రోల్ చేస్తున్నా ధోనీ నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి సమాధానం రాలేదు. నిజానికి వీళ్లిద్దరి మధ్య ఫైట్ సరదాగా నడుస్తున్నదే. ఎన్నోసార్లు ధోనీని పొగుడుతూ కేపీ కామెంట్స్ చేశాడు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్