Gavaskar on Dhoni: ధోనీని ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు.. అందుకే అలా చేశాను: గవాస్కర్-gavaskar on dhoni says who does not love him ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Gavaskar On Dhoni Says Who Does Not Love Him

Gavaskar on Dhoni: ధోనీని ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు.. అందుకే అలా చేశాను: గవాస్కర్

గవాస్కర్ షర్ట్ పై ఆటోగ్రాఫ్ ఇస్తున్న ధోనీ
గవాస్కర్ షర్ట్ పై ఆటోగ్రాఫ్ ఇస్తున్న ధోనీ (ANI)

Gavaskar on Dhoni: ధోనీని ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి అంటూ అతనిపై గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం వెనుక ఉన్న కారణాన్ని కూడా వివరించాడు.

Gavaskar on Dhoni: ఐపీఎల్లో సీఎస్కే, కేకేఆర్ మ్యాచ్ ముగిసిన తర్వాత తన షర్ట్ పై ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు సునీల్ గవాస్కర్. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అంతటి లెజెండరీ క్రికెటర్.. మరో క్రికెటర్ ఆటోగ్రాఫ్ ఇలా తీసుకోవడం అభిమానులకు ఆకట్టుకుంది. దీనిపై సన్నీ స్పందిస్తూ.. అసలు ధోనీని ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి అని అనడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ ఆటోగ్రాఫ్ కోసం తానేం చేశానో కూడా ఈ సందర్భంగా ఈ లిటిల్ మాస్టర్ వివరించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నై గ్రౌండ్ చుట్టూ తిరుగుతున్న ధోనీ దగ్గరికి వెళ్లి మరీ గవాస్కర్ తన షర్ట్ పై అతని ఆటోగ్రాఫ్ తీసుకోవడం విశేషం. సన్నీ కోరికను కాదనలేని ధోనీ తన సంతకం చేసిన తర్వాత గవాస్కర్ ను హత్తుకున్నాడు.

దీని తర్వాత గవాస్కర్ లైవ్ క్రికెట్ షోలో పాల్గొన్నాడు. ఇప్పటికీ ఎంతో మంది యువ క్రికెటర్లు ధోనీ వైపే చూస్తుంటారని ఈ సందర్భంగా అతడు అన్నాడు. "ఎమ్మెస్ ధోనీని ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు? గత కొన్నేళ్లుగా ఇండియన్ క్రికెట్ కు అతడు అందించిన సేవలు అద్బుతం. నా వరకూ అతడు ఓ రోల్ మోడల్ గా నిలిచిన తీరు నచ్చుతుంది. ఇండియాలో ఎంతోమంది యువకులు ధోనీ నుంచి నేర్చుకుంటారు. తనను తాను ధోనీ మలచుకున్న తీరు అత్యద్భుతం" అని సన్నీ అన్నాడు.

ఇక ఆటోగ్రాఫ్ విషయంపై కూడా అతడు స్పందించాడు. "చెన్నై టీమ్ గ్రౌండ్ చుట్టూ ఓ రౌండ్ వేస్తుందని తెలియగానే నేను ఓ పెన్ సంపాదించాను. దానిని నా దగ్గరే పెట్టుకున్నాను. థ్యాంక్యూ సో మచ్" అని గవాస్కర్ అన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో సీఎస్కే ఓడిపోయింది. ఈ సీజన్ లో చెన్నై టీమ్ సొంతగడ్డపై ఆడిన చివరి మ్యాచ్ ఇదే కావడం విశేషం.

అయితే ధోనీ అక్కడ చివరి మ్యాచ్ ఆడేశాడా? లేక వచ్చే సీజన్ లోనూ ఆడతాడా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ మ్యాచ్ తర్వాత సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ.. ధోనీ వచ్చే సీజన్ ఆడతాడని భావిస్తున్నట్లు చెప్పడం గమనార్హం.

సంబంధిత కథనం