Most Ducks in IPL: ఐపీఎల్లో రోహిత్ పేరిట ఉన్న ఈ చెత్త రికార్డు గురించి తెలుసా?-most ducks in ipl as rohit sharma leads the chart with 14 times
Telugu News  /  Sports  /  Most Ducks In Ipl As Rohit Sharma Leads The Chart With 14 Times
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ

Most Ducks in IPL: ఐపీఎల్లో రోహిత్ పేరిట ఉన్న ఈ చెత్త రికార్డు గురించి తెలుసా?

24 March 2023, 17:28 ISTHari Prasad S
24 March 2023, 17:28 IST

Most Ducks in IPL: ఐపీఎల్లో రోహిత్ శర్మ పేరిట ఉన్న ఓ చెత్త రికార్డు కూడా ఉంది. లీగ్ చరిత్రలో డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన రోహిత్.. ఎన్నో గొప్ప రికార్డులతోపాటు ఈ చెత్త రికార్డునూ సొంతం చేసుకున్నాడు.

Most Ducks in IPL: ఐపీఎల్ వస్తుందంటే చాలు రికార్డుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అత్యధిక రన్స్, అత్యధిక సెంచరీలు, ఫాస్టెస్ట్ సెంచరీలు, అత్యధిక సిక్స్ లు వంటి రికార్డుల గురించి చాలా మంది తెలుసు. అయితే ఈ మెగా లీగ్ లో ఎక్కువ సార్లు డకౌటైన ప్లేయర్స్ గురించి మీకు తెలుసా? ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకున్న ఐపీఎల్లో పది కంటే ఎక్కువసార్లు డకౌటైన వాళ్లు చాలా మందే ఉన్నారు.

అందులో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉండటం విశేషం. అత్యధిక పరుగులు, సిక్స్ లు, సెంచరీల రికార్డులతోపాటు ఐపీఎల్లో రోహిత్ పేరిట ఈ డకౌట్స్ రికార్డు కూడా ఉంది. 2008లో జరిగిన తొలి సీజన్ నుంచి ఐపీఎల్ ఆడుతున్న రోహిత్.. ఇప్పటి వరకూ 222 ఇన్నింగ్స్ ఆడాడు. అందులో ఏకంగా 14సార్లు డకౌటయ్యాడు. అత్యధిక డకౌట్స్ లిస్టులో అతడే టాప్ లో ఉండటం విశేషం.

అంతేకాదు ఈ డకౌట్స్ లిస్ట్ లో విదేశీ ప్లేయర్స్ కంటే ఇండియన్సే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన టాప్ 10 లిస్టులో మొదటి 8 మంది ఇండియన్ బ్యాటర్లే. రోహిత్ తోపాటు రహానే, రాయుడులాంటి ప్లేయర్స్ ఈ లిస్ట్ లో ఉన్నారు.

ఐపీఎల్లో అత్యధిక డకౌట్స్

రోహిత్ శర్మ - 14

మణ్‌దీప్ సింగ్ - 14

పియూష్ చావ్లా - 13

హర్భజన్ సింగ్ - 13

పార్థివ్ పటేల్ - 13

అజింక్య రహానే - 13

అంబటి రాయుడు - 13

దినేష్ కార్తీక్ - 13

రషీద్ ఖాన్ - 12

సునీల్ నరైన్ - 12

సంబంధిత కథనం