KKR vs RCB: కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌లో శార్దూల్, సుయశ్ బ్రేక్ చేసిన రికార్డులు ఇవే-kkr vs rcb match in numbers as shardul and suyash create some records ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kkr Vs Rcb: కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌లో శార్దూల్, సుయశ్ బ్రేక్ చేసిన రికార్డులు ఇవే

KKR vs RCB: కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌లో శార్దూల్, సుయశ్ బ్రేక్ చేసిన రికార్డులు ఇవే

Hari Prasad S HT Telugu
Apr 07, 2023 04:00 PM IST

KKR vs RCB: కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌లో శార్దూల్, సుయశ్ కొన్ని రికార్డులు బ్రేక్ చేశారు. ఆ రికార్డులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్ లో కేకేఆర్ ను 81 పరుగులతో ఆర్సీబీ చిత్తు చేసిన విషయం తెలిసిందే.

ఆర్సీబీని ఓడించి ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
ఆర్సీబీని ఓడించి ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (AP)

KKR vs RCB: ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతుల్లో ఓడినా.. తర్వాతి మ్యాచ్ లో తమకంటే ఎంతో బలంగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేకేఆర్ గెలిచింది. అయితే ఈ విజయంలో శార్దూల్ ఠాకూర్, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సుయశ్ శర్మలాంటి పెద్దగా పేరు లేని వాళ్లు కీలకపాత్ర పోషించడం విశేషం.

మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కేవలం 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో శార్దూల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి రింకు మంచి సహకారం అందించాడు. శార్దూల్ కేవలం 29 బంతుల్లో 68 రన్స్ చేయగా.. రింకు 33 బాల్స్ లో 46 రన్స్ చేశాడు. దీంతో కేకేఆర్ ఏకంగా 204 రన్స్ చేసింది. తర్వాత బౌలింగ్ లో తొలి మ్యాచ్ ఆడిన సుయశ్ మూడు వికెట్లు తీశాడు.

శార్దూల్, సుయశ్ రికార్డులు ఇవీ

- 100లోపే ఐదు వికెట్లు కోల్పోయినా 204 రన్స్ చేసింది కేకేఆర్. ఐపీఎల్లో ఇలా 100 లోపు ఐదు వికెట్లు పడిన తర్వాత కూడా ఇంత స్కోరు చేయడం ఇదే తొలిసారి.

- కేకేఆర్ ముగ్గురు స్పిన్నర్లు కలిసి 9 వికెట్లు తీశారు. ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్ లో స్నిన్నర్లు ఇన్ని వికెట్లు తీయడం ఇదే తొలిసారి.

- ఐపీఎల్లో ఏడు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ కు వచ్చి రెండో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్ గా శార్దూల్ (68) నిలిచాడు. గతంలో రసెల్ ఏడో నంబర్ లో వచ్చి 88 రన్స్ చేయగా.. బ్రావో 8వ స్థానంలో వచ్చి 68 రన్స్ చేశాడు.

- కేకేఆర్ చివరి 8.3 ఓవర్లలో 115 రన్స్ చేసింది. అంటే ఓవర్ కు 13.5 పరుగులు బాదింది. 100లోపే ఐదు వికెట్లు కోల్పోయిన సందర్భంలో ఈ రన్ రేట్ తో పరుగుల చేయడం ఐపీఎల్లో రెండో అత్యుత్తమం.

- ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగి సుయశ్ శర్మ 30 పరుగులకు మూడు వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్ లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన స్పిన్నర్ మయాంక్ మార్కండే (3/23) కాగా.. సుయశ్ రెండోస్థానంలో నిలిచాడు.

Whats_app_banner

సంబంధిత కథనం