IPL fan Parks: ఫ్యాన్ పార్క్స్ సూపర్ హిట్.. ఐపీఎల్ లైవ్‌కు ప్రేక్షకుల నుంచి భారీగా మద్దతు-ipl fan parks a nation wide hit as massive crowds gather to catch action on jiocinema ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Fan Parks: ఫ్యాన్ పార్క్స్ సూపర్ హిట్.. ఐపీఎల్ లైవ్‌కు ప్రేక్షకుల నుంచి భారీగా మద్దతు

IPL fan Parks: ఫ్యాన్ పార్క్స్ సూపర్ హిట్.. ఐపీఎల్ లైవ్‌కు ప్రేక్షకుల నుంచి భారీగా మద్దతు

Maragani Govardhan HT Telugu
May 03, 2023 02:08 PM IST

IPL fan Parks: జియో సినిమా ఏర్పాటు చేసిన ఐపీఎల్ ఫ్యాన్ పార్క్స్ ఐడియా సూపర్ హిట్ అవుతోంది. దేశవ్యాప్తంగా 7 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్స్‌లో లైవ్ ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు భారీగా ప్రేక్షకులు వస్తున్నారు.

ఐపీఎల్ ఫ్యాన్ పార్కుల్లో భారీగా జనం
ఐపీఎల్ ఫ్యాన్ పార్కుల్లో భారీగా జనం

IPL fan Parks: టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న జియో సినిమా.. పలు ప్రాంతాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్‌లు(IPL Fan Parks) ఏర్పాటు చేసి వైవిధ్యంగా అభిమానులకు క్రికెట్ అనుభూతిని కలిగిస్తోంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, వడోదర, బర్ధమాన్, జల్గావ్, వారణాసి, కర్నాల్, తూత్తుకుడి లాంటి నగరాల్లో ఫ్యాన్ పార్కులుగా ఎంచుకుంది. వీకెండ్‌లలో ఈ ఏడు ఫ్యాన్ పార్క్‌ల్లో జియో సినిమా ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ విధానానికి క్రికెట్ ప్రియుల నుంచి కూడా బాగా మద్దతు లభిస్తోంది. దాదాపు 30 వేల మందికి పైగా ప్రేక్షకులు తమ అభిమాన జట్లకు సపోర్ట్ చేస్తున్నారు.

35 నగరాలు, పట్టణాల్లో స్ట్రీమింగ్ వేదికలకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ప్రతి వినియోగదారుని, క్రికెట్ కమ్యూనిటీని ఇందులో భాగం చేసింది జియో సినిమా. తమ డిజిటల్-ఫస్ట్ ఆఫర్‌లను విస్తరిస్తూ.. మొదటిసారిగా డిజిటల్‌లో 13 రాష్ట్రాలలో ఇంటి వెలుపల క్రీడల వీక్షణను సర్వవ్యాప్తి చేయాలని యోచిస్తోంది. ఏప్రిల్ 16 నుంచి ఇప్పటి వరకు మొదటి మూడు వీకెండ్లలో దాదాపు 15 నగరాలు, పట్టణాలు కవర్ చేశారు. ప్రేక్షకులు మూకుమ్మడిగా చూసేందుకు ఓ క్రీడా ఈవెంట్‌ను డిజిటల్ స్ట్రీమింగ్ చేయించడం ఇదే తొలిసారి. ఈ టోర్నీని దేశంలో ప్రతి ఇంటర్నెట్ వినియోగదారు వద్దకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

గత వీకెండ్‌లో ముందుగా శనివారం నాడు కేకేఆర్-గుజరాత్, సన్‌రైజర్స్-దిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లను కర్నూలు, వడోదర, బర్ధమాన్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. జల్గావ్, వారణాసి, కమల్, తూత్తుకూడిలో ఆదివారం నాడు జరిగిన చెన్నై-పంజాబ్ కింగ్స్, రాజస్థాన్-ముంబయి ఇండియన్స్ మ్యాచ్‌ను అభిమానులు వీక్షించారు.

దేశవ్యాప్తంగా 7 నగరాల్లోని ప్రధాన పబ్లిక్ ప్రదేశాల్లో అభిమానుల కోసం ఐపీఎల్ ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేయడంతో ఇవి వినోద కేంద్రాలుగా మారాయి. ప్రేక్షకులు లైవ్ స్ట్రీమింగ్‌ను వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి వీక్షించి ఆనందాన్ని పొందుతున్నారు. జియో సినిమా వినియోగదారులకు ప్రాధాన్యమిస్తూ ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడమే కాకుండా.. కమ్యూనిటీ వీక్షణ పేరుతో సరికొత్త గ్లోబల్ బెంచ్ మార్కును సెట్ చేస్తోంది.

టాపిక్