Yashasvi Jaiswal Century: దంచి కొట్టిన యశస్వి జైస్వాల్ - 52 బాల్స్‌లోనే సెంచరీ
RR vs MI: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో మెరిశాడు. 62 బాల్స్‌లో 124 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. అతడి జోరుతో ముంబై ముందు రాజస్థాన్ 213 పరుగులు భారీ టార్గెట్‌ను విధించింది.
IPL 2023 RR vs MI - Yashasvi Jaiswal Century: యశస్వి జైస్వాల్ మెరుపు శతకంతో ముంబై ఇండియన్స్ ముందు రాజస్థాన్ రాయల్స్ భారీ టార్గెట్‌ను విధించింది. రాజస్థాన్ యువ సంచలనం యశస్వి.. సిక్సర్లు, ఫోర్లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 62 బాల్స్‌లోనే ఎనిమిది సిక్సర్లు, పదహారు ఫోర్లతో 124 రన్స్ చేశాడు.
అతడి బ్యాటింగ్ జోరుతో రాజస్థాన్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో 52 బాల్స్‌లోనే యశస్వి జైస్వాల్ సెంచరీ మార్కును చేరుకున్నాడు. అతడి ఒంటరి పోరాటంతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. యశస్వి మినహా మిగిలిన రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేకపోయారు.
యశస్వి జైస్వాల్ తర్వాత 18 పరుగులతో బట్లర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సంజూ శాంసన్ (14 రన్స్), హోల్డర్ (11 రన్స్) చేశారు. ఓ వైపు వికెట్ పడుతోన్నా తన జోరు మాత్రం ఆపలేదు యశస్వి జైశ్వాల్. చివరి ఓవర్‌లో అర్షద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్ మూడు, పీయూష్ చావ్లా రెండు వికెట్లు తీసుకున్నారు. ముంబై ఇండియన్స్ ముందు 213 పరుగుల లక్ష్యం ఉంది.
టాపిక్