IND vs WI: మూడో వన్డేలో టీమ్ ఇండియా ఘన విజయం - సిరీస్ క్లీన్‌స్వీప్
విండీస్‌తో సిరీస్‌ను టీమ్ ఇండియా 3-0తో వైట్‌వాష్ చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో 119 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ఫై భారత జట్టు ఘన విజయాన్ని సాధించింది. బ్యాటింగ్ శుభ్‌మన్(Shubman Gill),బౌలింగ్‌లో చాహల్ (Yuzvendra Chahal) రాణించారు.
India vs West Indies Odi Series: వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3- 0 తో టీమ్ ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో 119 పరుగులు తేడాతో వెస్టిండీస్‌పై భారత జట్టు విజయాన్ని సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 36 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా 36 ఓవర్లలో 225 రన్స్ చేసింది. ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ 98 రన్స్ తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తృటిలో సెంచరీ మిస్సయ్యాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియాకు ధావన్, శుభ్‌మన్ నిలకడగా ఆడుతూ శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 113 రన్స్ జోడించారు. ధావన్ నిదానంగా ఆడగా శుభ్‌మన్ ఫోర్లు, సిక్సర్లతో విండీస్ బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించాడు. 22వ ఓవర్ వద్ద ఈ జోడికి బ్రేక్ పడింది. 74 బాల్స్ లో ఏడు ఫోర్లతో 58 రన్స్ చేసిన ధాన్ ఔటయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్‌తో కలిసి శుభ్‌మన్ స్కోరు వేగం పెంచాడు. 34 బంతుల్లో 44 రన్స్ చేసి శ్రేయస్ ఔటయ్యాడు.
36 ఓవర్లలో 225 పరుగులు వద్ద ఉన్న సమయంలో భారీ వర్షం పడటంతో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. 98 బాల్స్‌లో 2 సిక్సర్లు, ఏడు ఫోర్లతో 98 పరుగులు చేసిన శుభ్‌మన్ నాటౌట్‌గా నిలిచాడు. డక్‌వర్త్ లూయిస్ విధానంలో 35 ఓవర్లలో విండీస్ టార్గెట్‌ను 257 రన్స్‌గా నిర్ణయించారు. లక్ష్యఛేదనలో తడబడిన విండీస్ 26 ఓవర్లలో 137 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. ఆరంభంలోనే మేయర్స్, బ్రూక్స్‌ను డకౌట్ చేసి విండీస్‌ను పేసర్ సిరాజ్ దెబ్బకొట్టాడు.
కెప్టెన్ నికోలస్ పూరన్, బ్రెండన్ కింగ్ కలిసి విండీస్ ను గాడినపెట్టే ప్రయత్నం చేశారు. ఇద్దరు ధాటిగా ఆడటంతో విండీస్ కోలుకునేలా కనిపించింది. పూరన్ (42 రన్స్) కింగ్ (42 రన్స్) తక్కువ పరుగులు వ్యవధిలోనే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన మిగిలిన బ్యాట్స్‌మెన్స్ అందరూ సింగిల్ డిజిట్‌కు పరిమితం కావడంతో విండీస్ ఇన్నింగ్స్ తొందరగానే ముగిసింది. టీమ్ ఇండియా బౌలర్లలో చాహల్ నాలుగు, శార్దూల్ ఠాకూర్, సిరాజ్ తలో రెండు, అక్షర్‌పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు శుభ్‌మన్‌గిల్ కు దక్కింది.
సంబంధిత కథనం
టాపిక్