Hardik Pandya Private Jet: హార్దిక్ ప్రైవేట్ జెట్ చూశారా.. అతని రోజు ఇలా గడుస్తుంది.. వీడియో
Hardik Pandya Private Jet: హార్దిక్ పాండ్యా ప్రైవేట్ జెట్.. అతని జీవితంలో ఒక రోజు ఎలా గడుస్తుందో చూశారా? దీనికి సంబంధించిన వీడియోను హార్దిక్ బుధవారం (ఆగస్ట్ 24) తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
Hardik Pandya Private Jet: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా లగ్జరీ లైఫ్ గడపడానికి ఇష్టపడతాడు. ఫీల్డ్‌లో ఓ క్రికెటర్‌గా రాణించడానికి ఎంత కష్టపడతాడో.. బయట అదే రేంజ్‌లో ఎంజాయ్ చేస్తాడు. తన ఒక రోజు లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుందో చూడాలనుకునే ఫ్యాన్స్ కోసం హార్దిక్ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
ప్రస్తుతం ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్న హార్దిక్.. అటు ప్రాక్టీస్ చేస్తూనే ఇటు ఫ్యామిలీతోనూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక రోజు ఉదయాన్నే తన ప్రైవేట్ జెట్‌లో ఎక్కడంతో మొదలైన అతని జీవితం రాత్రి అదే జెట్ దిగడంతో ఎలా ముగుస్తుందో ఈ రీల్‌లో హార్దిక్ చూపించాడు. ఇందులో అతని ప్రైవేట్ జెట్‌తోపాటు లగ్జరీ కార్లు, ఇంటిని కూడా చూడొచ్చు.
తన తల్లిని హగ్ చేసుకోవడం, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం, ఫీల్డ్‌లో ప్రాక్టీస్ చేయడంలాంటివన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. బుధవారం హార్దిక్ ఈ వీడియోను 'ఎ డే ఇన్ మై లైఫ్' క్యాప్షన్‌తో పోస్ట్ చేశాడు. ఈ రీల్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. గంటల్లోనే లక్షల కొద్దీ లైక్స్, వేల కామెంట్స్ వచ్చాయి. చాలా మంది ఫైర్, హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేశారు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్‌గా వచ్చిన తర్వాత హార్దిక్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్‌ను విజేతగా నిలపడంతోపాటు ఐర్లాండ్‌లో రెండు టీ20ల సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గానూ ఉన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌కూ కెప్టెన్సీ వహించాడు. ఈ మ్యాచ్‌లన్నింట్లోనూ ఇండియానే గెలవడం విశేషం.