Dinesh Karthik Tweet: టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌కు ఎంపికైన తర్వాత దినేష్‌ కార్తీక్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌-dinesh karthik tweet after selected for t20 world cup going viral ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dinesh Karthik Tweet: టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌కు ఎంపికైన తర్వాత దినేష్‌ కార్తీక్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌

Dinesh Karthik Tweet: టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌కు ఎంపికైన తర్వాత దినేష్‌ కార్తీక్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌

Hari Prasad S HT Telugu

Dinesh Karthik Tweet: టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌కు ఎంపికైన తర్వాత దినేష్‌ కార్తీక్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అతడు నాలుగు పదాల్లో చేసిన ఆ ట్వీట్‌ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది.

వరల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ (Twitter)

Dinesh Karthik Tweet: టీ20 వరల్డ్‌కప్‌ కోసం సోమవారం (సెప్టెంబర్‌ 12) బీసీసీఐ ఇండియన్‌ టీమ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టీమ్‌లో పెద్దగా ఆశ్చర్యకర నిర్ణయాలు ఏమీ లేవు. వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడమే అతని ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ కలిగించింది. అయితే టీమ్‌ రేసులో నలుగురు వికెట్‌ కీపర్లు ఉండగా.. రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు.

ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించి మూడేళ్ల తర్వాత తిరిగి టీమ్‌లోకి వచ్చిన దినేష్‌ కార్తీక్‌.. వరల్డ్‌కప్‌ ఆడాలని ఉందంటూ పదే పదే చెబుతూ వస్తున్నాడు. మొత్తానికి అతని కల నెరవేరింది. వరల్డ్‌కప్‌ టీమ్‌లో అతనికి చోటు దక్కింది. అప్పుడెప్పుడో 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన కార్తీక్‌.. ఇప్పుడు మరోసారి వరల్డ్‌కప్‌ టీమ్‌లోకి ఎంపిక కావడం విశేషమే.

ఐపీఎల్‌ నుంచీ ఫినిషర్‌గా కొత్త రోల్‌ను సొంతం చేసుకున్న కార్తీక్‌ను టీ20 వరల్డ్‌కప్‌లో కచ్చితంగా ఆడించాల్సిందే అన్న డిమాండ్లు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. అందరి అంచనాలను అందుకుంటూ ఆ రోల్‌ను కార్తీక్‌ కూడా సమర్థంగా పోషిస్తుండటంతో సెలక్టర్లు అతనికి అవకాశమిచ్చారు. అయితే వరల్డ్‌కప్‌ టీమ్‌ను ప్రకటించగానే కార్తీక్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

"కలలు నిజంగానే నిజమవుతాయి" అని కార్తీక్‌ ట్వీట్‌ చేశాడు. ఆర్సీబీ తరఫున సక్సెస్‌ఫుల్‌ ఫినిషర్‌గా పేరు సంపాదించిన సమయంలోనే తాను తిరిగి ఇండియన్‌ టీమ్‌ తరఫున వరల్డ్‌కప్‌లో ఆడాలని కలలు కంటున్నట్లు చెప్పాడు. మొత్తానికి ఇప్పుడా కల నిజం కావడంతో కార్తీక్‌ ఇలా ట్వీట్‌ చేశాడు. ఈ మధ్యే ముగిసిన ఆసియా కప్‌ టీమ్‌లో కార్తీక్‌ ఉన్నా కూడా.. తొలి మ్యాచ్‌లో తప్ప అతనికి తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు.

టీ20 వరల్డ్‌కప్‌లో అక్టోబర్‌ 23న పాకిస్థాన్‌తోనే ఇండియా తన తొలి మ్యాచ్‌ ఆడబోతోంది. ఈ మెగా టోర్నీ కోసం ఇండియన్‌ టీమ్‌లోకి బుమ్రా, హర్షల్‌ పటేల్‌లు కూడా తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. అయితే షమి, శ్రేయర్‌ అయ్యర్‌లను స్టాండ్‌బైలుగా ఉంచారు.