Mohammed Shami Back in Team: ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లకు తిరిగొచ్చిన మహ్మద్‌ షమి-mohammed shami back in team for australia and south africa series ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Mohammed Shami Back In Team For Australia And South Africa Series

Mohammed Shami Back in Team: ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లకు తిరిగొచ్చిన మహ్మద్‌ షమి

Hari Prasad S HT Telugu
Sep 12, 2022 06:38 PM IST

Mohammed Shami Back in Team: ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరగబోయే టీ20 సిరీస్‌లకు తిరిగి టీమ్‌లోకి వచ్చాడు మహ్మద్‌ షమి. టీ20 వరల్డ్‌కప్‌కు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉంచినా.. ఈ సిరీస్‌లకు మాత్రం అతన్ని ఎంపిక చేయడం విశేషం.

మహ్మద్ షమి
మహ్మద్ షమి (AP)

Mohammed Shami Back in Team: టీ20 వరల్డ్‌కప్‌తోపాటు సొంతగడ్డపై ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరగబోయే టీ20ల సిరీస్‌లకు కూడా బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. ఈ టీమ్‌లోకి పేస్‌బౌలర్‌ మహ్మద్‌ షమి తిరిగి వచ్చాడు. ఆసియాకప్‌ కోసం అతని పేరును పరిశీలించని సెలక్టర్లు.. ఈ రెండు సిరీస్‌లకు మాత్రం ఎంపిక చేయడం గమనార్హం.

అయితే టీ20 వరల్డ్‌కప్‌కు మాత్రం మరోసారి అతన్ని స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉంచారు. ఇక వరల్డ్‌కప్‌ టీమ్‌లో చోటు దక్కించుకున్న బుమ్రా, హర్షల్‌ పటేల్‌లు కూడా ఈ రెండు సిరీస్‌ల కోసం టీమ్‌లోకి వచ్చారు. ఈ ఇద్దరూ గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమైన విషయం తెలిసిందే. వీళ్లు ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్‌ అకాడెమీలో రీహ్యాబిలిటేషన్‌లో ఉన్నారు.

సెప్టెంబర్‌ 20న ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుండగా.. అది ముగియగానే సెప్టెంబర్‌ 28 నుంచి సౌతాఫ్రికాలో మరో మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది. సౌతాఫ్రికాతో ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్‌ కూడా ఉంది. అయితే ఈ టీమ్‌ను ఇంకా ప్రకటించలేదు. ఇక ఆసియాకప్‌తోపాటు టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌లోనూ ఉన్న హార్దిక్‌ పాండ్యా, అర్ష్‌దీప్‌ సింగ్‌, భువనేశ్వర్‌కుమార్‌లు మాత్రం సౌతాఫ్రికాతో సిరీస్‌కు అందుబాటులో లేరు. ఈ ముగ్గురూ నేషనల్‌ క్రికెట్‌ అకాడెమీకి వెళ్లనున్నారు.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు టీమిండియా: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా, అశ్విన్‌, చహల్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌కుమార్‌, మహ్మద్‌ షమి, హర్షల్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు టీమిండియా: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌, అశ్విన్‌, చహల్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, షమి, హర్షల్‌ పటేల్, దీపక్‌ చహర్‌, బుమ్రా

WhatsApp channel