Dhoni Salt & Pepper look: ధోనీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్.. వైరల్ అవుతున్న ఫొటో-dhoni salt and pepper look amuses fans ahead of ipl 2023 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Dhoni Salt And Pepper Look Amuses Fans Ahead Of Ipl 2023

Dhoni Salt & Pepper look: ధోనీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్.. వైరల్ అవుతున్న ఫొటో

Hari Prasad S HT Telugu
Jan 20, 2023 04:34 PM IST

Dhoni Salt & Pepper look: ధోనీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత ఈ మధ్యే కెమెరాలకు చిక్కిన ధోనీ.. పూర్తిగా కొత్త లుక్ లో కనిపించడం అభిమానులకు ఆశ్చర్యానికి గురి చేసింది.

ధోనీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్
ధోనీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్

Dhoni Salt & Pepper look: ఇండియన్ క్రికెట్ లోకి వచ్చిన కొత్తలో ధోనీ ఎలా ఉండే వాడో తెలుసు కదా? జులపాల జుట్టుతో టార్జాన్ ను తలిపించేలా ఉండేవాడు. ఝార్ఖండ్ నుంచి అతడు.. పెద్దగా స్టైల్స్ అంటే తెలియనట్లే కనిపించాడు. కానీ ఒక్కసారి టీమిండియాలో ఓ రేంజ్ కు వెళ్లి.. కెప్టెన్ అయిన తర్వాత తన లుక్ పూర్తిగా మార్చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

ఆ తర్వాత తరచూ తన లుక్ మారుస్తూ వచ్చాడు. రకరకాల హెయిర్ స్టైల్స్ మార్చాడు. ఇక ఇప్పుడిలా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కొత్తగా కనిపించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత కేవలం ఐపీఎల్ లోనే కనిపిస్తున్న ధోనీ.. ఎప్పుడో ఒకసారిగానీ కెమెరాకు చిక్కడం లేదు. తాజాగా తన ప్రాక్టీస్ సెషన్ ముగించుకొని వెళ్తున్న ధోనీ ఇలా కొత్తగా కనిపించడం చాలా మందిని ఆకర్షించింది.

పూర్తిగా తెల్ల గడ్డం.. నల్ల రంగు జుట్టుతో ఇలా కనిపించాడు. నిజానికి ఒక రోజు ముందు కూడా ధోనీ ఫొటోలను కొందరు అభిమానులు తీశారు. కానీ దూరం నుంచి కావడంతో అతన్ని స్పష్టంగా గుర్తించలేకపోయారు. ఇక శుక్రవారం (జనవరి 20) ప్రాక్టీస్ సెషన్ కు వెళ్లి వస్తున్న ధోనీ ఇలా కెమెరాకు స్పష్టంగా కనిపించాడు. ఐపీఎల్ 2023 కోసం ధోనీ తన ప్రిపరేషన్ ప్రారంభించాడు.

ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ ఈ ఫోటోని ట్విటర్ లో షేర్ చేస్తూ.. ధోనీ కొత్త సాల్ట్ & పెప్పర్ లుక్ అదుర్స్ అని కామెంట్లు చేస్తున్నారు. కొత్త సీజన్ కోసం తాము ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు కొందరు ఫ్యాన్స్ చెప్పారు.

ధోనీకి ఇప్పుడు రాబోయే ఐపీఎల్ సీజనే చివరిదిగా భావిస్తున్నారు. నిజానికి గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణమైన ప్రదర్శన తర్వాత ధోనీ ఇక గుడ్ బై చెబుతాడని అనుకున్నారు. కానీ ఇదే ప్రశ్న అతన్ని అడిగితే.. తాను చెన్నై ప్రేక్షకుల ముందు తన చివరి మ్యాచ్ ఆడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

ఇప్పటి వరకూ ధోనీ కెప్టెన్సీలో చెన్నై నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. ఇక ఇప్పుడు ఐదోసారి గెలిచి ముంబై రికార్డును సమం చేయాలని చెన్నై భావిస్తోంది. ఈ విజయంతో ధోనీ ఘనంగా తన కెరీర్ కు ముగింపు పలకొచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం