Ramiz on Babar: బాబర్ ఆజంను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా: రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్
Ramiz on Babar: బాబర్ ఆజంను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్, పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. లైవ్ కామెంటరీలో రమీజ్ ఈ కామెంట్స్ చేయడం గమనార్హం.
Ramiz on Babar: అతడో టాప్ క్రికెటర్. పాకిస్థాన్ టీమ్ కు గతంలో కెప్టెన్ గా చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ గానూ ఉన్నాడు. కానీ అంతటి క్రికెటర్ కూడా చీప్ కామెంటరీతో షాక్ కు గురి చేశాడు. లంక ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా రమీజ్ రాజా చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంను పొగుడుతూ రమీజ్ గీత దాటాడు.
అసలు ఏం జరిగిందంటే.. లంక లీగ్ లో భాగంగా కొలంబో స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్న బాబర్.. తన తొలి సెంచరీ చేశాడు. సోమవారం జరిగిన మ్యాచ్ లో బాబర్ సెంచరీతో చేయడంతో ఆ మ్యాచ్ లో కొలంబో గెలిచింది. ఈ సందర్భంగా కామెంటరీ బాక్స్ లో ఉన్న రమీజ్ స్పందిస్తూ.. బాబర్ ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటూ సరదాగా కామెంట్ చేశాడు.
అతడు ఫన్నీగానే కామెంట్ చేసినా.. ఫ్యాన్స్ కు మాత్రం అది రుచించలేదు. లైవ్ కామెంటరీలో ఇవేం కామెంట్స్ అంటూ రమీజ్ ను ఏకిపారేస్తున్నారు. బాబర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత అతని గురించి రమీజ్ స్పందిస్తూ.. "క్లాస్, క్వాలిటీ, సెక్యూరిటీతో కూడిన ఫిఫ్టీ. కామ్‌గా తన పని చేసేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడే సరైన వ్యక్తి. చివరి వరకూ క్రీజులో ఉండి బ్యాటింగ్ చేయగలడు. అతడంటే నాకు చాలా ఇష్టం. నిజమే నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా" అని రమీజ్ అనడం విశేషం.
ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కెప్టెన్ గా, పీసీబీ చీఫ్ గా చేసిన వ్యక్తి హుందాగా వ్యవహరించాలి కానీ ఇలాంటి కామెంట్స్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బాబర్ లంక ప్రీమియర్ లీగ్ తన తొలి సెంచరీ చేశాడు. టీ20ల్లో అతనికిది 10వ సెంచరీ. ఈ క్రమంలో గేల్ తర్వాత టీ20ల్లో పది, అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో బ్యాటర్ గా బాబర్ నిలిచాడు.
సంబంధిత కథనం