Asian Games Shooting: ఏషియన్ గేమ్స్ షూటింగ్‌లో ఐదో గోల్డ్ మెడల్.. వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన మన షూటర్లు-asian games shooting india won fifth gold sets new world record ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Asian Games Shooting: ఏషియన్ గేమ్స్ షూటింగ్‌లో ఐదో గోల్డ్ మెడల్.. వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన మన షూటర్లు

Asian Games Shooting: ఏషియన్ గేమ్స్ షూటింగ్‌లో ఐదో గోల్డ్ మెడల్.. వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన మన షూటర్లు

Hari Prasad S HT Telugu
Sep 29, 2023 09:13 AM IST

Asian Games Shooting: ఏషియన్ గేమ్స్ షూటింగ్‌లో ఐదో గోల్డ్ మెడల్ సాధించింది ఇండియా. శుక్రవారం (సెప్టెంబర్ 29) జరిగిన ఈవెంట్లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు మన షూటర్లు.

ఏషియన్ గేమ్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లో గోల్డ్ సాధించిన ఇండియన్ టీమ్
ఏషియన్ గేమ్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లో గోల్డ్ సాధించిన ఇండియన్ టీమ్ (PTI)

Asian Games Shooting: ఏషియన్ గేమ్స్ 2023 షూటింగ్ లో మనవాళ్లు పతకాల పంట పండిస్తూనే ఉన్నారు. తాజాగా షూటింగ్ లో ఐదో గోల్డ్ మెడల్ దక్కడం విశేషం. ఇండియాకు చెందిన 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఐశ్వరి తోమార్, స్వాప్నిల్ కుశాలె, అఖిల్ షెవోరన్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఈ క్రమంలో వాళ్లు వరల్డ్ రికార్డు కూడా క్రియేట్ చేశారు.

ఏషియన్ గేమ్స్ 2023లో భాగంగా శుక్రవారం (సెప్టెంబర్ 29) జరిగిన ఈ ఈవెంట్లో ఈ ముగ్గురూ అద్భుతమైన ప్రదర్శనతో గోల్డ్ సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న గేమ్స్ లో షూటింగ్ లోనే ఇది 15వ మెడల్ కాగా.. ఐదో గోల్డ్ మెడల్ కావడం విశేషం. ఓవరాల్ గా ఇండియా గోల్డ్ మెడల్స్ సంఖ్య ఏడుకి చేరింది. మరో రెండు గోల్డ్ మెడల్స్ క్రికెట్, ఈక్వెస్ట్రియాన్ లలో వచ్చిన విషయం తెలిసిందే.

మరో వరల్డ్ రికార్డ్

ఏషియన్ గేమ్స్ షూటింగ్ లో మరో గోల్డ్ మెడలే కాదు.. వరల్డ్ రికార్డు కూడా క్రియేట్ చేశారు ఐశ్వరి తోమార్, స్వాప్నిల్ కుశాలె, అఖిల్. వీళ్లకు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో 1769 స్కోరు సాధించి ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. గతేడాది 1761 స్కోరుతో అమెరికా క్రియేట్ చేసిన రికార్డును వీళ్లు బ్రేక్ చేయడం విశేషం.

ఇక ఈ ఈవెంట్లో చైనా 1763 స్కోరుతో సిల్వర్ మెడల్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా 1748 స్కోరుతో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాయి. మరోవైపు వ్యక్తిగత క్వాలిఫికేషన్ రౌండ్లో స్వాప్నిల్, ఐశ్వరి ఇద్దరూ 591 స్కోరు సాధించి టాప్ 2లో నిలిచారు. క్వాలిఫికేషన్ రౌండ్లో ఈ ఇద్దరి స్కోర్లు కొత్త ఏషియన్ గేమ్స్, ఏషియన్ షూటింగ్ రికార్డులను క్రియేట్ చేశాయి.

ఈ ఇద్దరూ ఫైనల్ కు అర్హత సాధించగా.. అఖిల్ మాత్రం విఫలమయ్యాడు. ఇక తాజా ఏషియన్ గేమ్స్ లో షూటర్లు పతకాల పంట పండిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్, వుమెన్స్ 25 మీటర్ల పిస్టల్ టీమ్, వుమెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్, మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ లు కూడా గోల్డ్ మెడల్స్ గెలిచాయి.

Whats_app_banner

టాపిక్