Ben Stokes Undervalued in IPL2023: స్టోక్స్ ధర తగ్గింది.. అతడి కోసం ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు.. డివిలయర్స్ స్పష్టం-ab de villiers says ben stokes has undervalued and unpaid in ipl 2023 auction ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ben Stokes Undervalued In Ipl2023: స్టోక్స్ ధర తగ్గింది.. అతడి కోసం ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు.. డివిలయర్స్ స్పష్టం

Ben Stokes Undervalued in IPL2023: స్టోక్స్ ధర తగ్గింది.. అతడి కోసం ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు.. డివిలయర్స్ స్పష్టం

Maragani Govardhan HT Telugu
Dec 24, 2022 07:47 AM IST

Ben Stokes Undervalued in IPL2023: ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ధర కాస్త తగ్గిందని సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. అతడి కోసం ఎంతైనా ఖర్చు పెట్టవచ్చని స్పష్టం చేశాడు.

బెన్ స్టోక్స్
బెన్ స్టోక్స్

Ben Stokes Undervalued in IPL2023: కొచ్చి వేదికగా శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఫ్రాంఛైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అందరికంటే ఎక్కువగా హైదరాబాద్ జట్టు 13 మంది ప్లేయర్లను సొంతం చేసుకోగా.. దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదుగురును దక్కించుకుంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఈ సారి భారీగా ధర పలికింది. సామ్ కరన్(రూ.18.50 కోట్లు), బెన్ స్టోక్స్(రూ.16.25 కోట్లు), హ్యారీ బ్రూక్ (రూ.13.25 కోట్లు) అధిక మొత్తానికి అమ్ముడుపోయారు. అయితే బెన్‌స్టోక్స్ విషయంలో అతడి ధర కాస్త తగ్గిందని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. తనకు ఇంకాస్త ఎక్కువ సొమ్ము వచ్చే అవకాశముందని స్పష్టం చేశాడు.

"బెన్ స్టోక్స్‌ను సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ లక్కీ టీమ్. స్టోక్స్‌కు ఎంత డబ్బు ఇచ్చిన తక్కువేనని అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే అతడు నమ్మశక్యం కానీ రీతిలో ఆడతాడు. బంతి, బ్యాట్‌ రెండింటితోనూ ఆకట్టుకోగలడు. క్రికెట్‍‌లో అతడు జట్టును విజయ తీరాలకు చేర్చే సమర్థుడు. నాకు తెలిసి అతడి ధర కాస్త తగ్గిందని అనుకుంటున్నారు. ఇంకాస్త ఇవ్వవచ్చు. అతడి వల్ల చాలా ప్రయోజనం ఉంది." అని డివిలియర్స్ అన్నారు.

బెన్ స్టోక్స్ గురించి అతడి మాజీ కెప్టెన్ ఇయన్ మోర్గాన్ కూడా స్పందించాడు. స్టోక్స్ అనుభవం, ఒత్తిడిలో అతడు చూపించే తెగువకు ఎంత ఇచ్చినా తక్కువేనని అభిప్రాయపడ్డాడు.

"బెన్ స్టోక్స్‌ను పొందెందుకు ఎంత ఖర్చు చేసిన వృథా కాదు. ప్రపంచకప్ ఫైనల్‌లో చూసినట్లుగా ప్రశాంతంగానే ఉంటూనే అవసరమైనప్పుడు దూకుడుగానూ మారతాడు. అతడు కొత్త బంతిని కూడా తీసుకోగలడు. ఇది కంప్లీట్ ప్యాకేజ్. అలాంటి ఆటగాడు కోసం ఖర్చు ఏమి ఉంది?" అని మోర్గాన్ అన్నాడు.

బెన్ స్టోక్స్‌ను దక్కించేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఆసక్తి చూపాయి. స్వల్ప వ్యవధిలోనే అతడి కోసం రూ.10 కోట్లను ఖర్చు పెట్టేందుకు చూశారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ చివరకు వెనక్కి తగ్గకుండా రూ.16.25 కోట్లకు అతడిని దక్కించుకుంది. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు స్టోక్స్.

సంబంధిత కథనం

టాపిక్