కాళ్లకు పసుపు ఇలా రాసుకుంటే దరిద్రమా? ఎలా రాసుకుంటే శుభం కలుగుతుంది? అసలు ఆడవాళ్లు పసుపు ఎందుకు రాసుకోవాలి?
కాళ్లకు పసుపు రాసుకోవడం భారతీయ మహిళలకు అలవాటు. ఎన్నే ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం వెనకున్న ఆంతర్యం ఏంటి.? కాళ్లకు పసుపు ఎలా రాసుకుంటే శుభప్రదం, ఎలా రాసుకుంటే దరిద్రం?
భారతదేశంలో పసుపు, కుంకుమలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇంటి ముందు ముగ్గుల నుంచి పెళ్లికి ఉపయెగించే తాళిబొట్టు, తలంబ్రాల వరకు పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. పూజకు, అక్షింతలకు పసుపు తప్పనిసరి కావాల్సిందే. పసుపు పారాణి, పసుపు బట్టలు, పసుపు నీళ్లు ఇలా పసుపు అంటేనే పవిత్రకు చిహ్నంగా భావిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. ఆడవారి అలంకరణలో కాళ్లకు పసుపుకు రాసుకోవడానికి ప్రాముఖ్యత ఎక్కువ. స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకునే సంప్రదాయం ఎందుకు వచ్చింది. పసుపు రాసుకోవడం వల్ల ఏం జరుగుతుంది. ఎలా రాసుకుంటే శుభఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్న దాని ప్రకారం.. స్త్రీలు చక్కగా అలంకరించుకుని చేసే పనులకు శుభ ఫలితాలు దక్కుతాయి. నుదుటిన బొట్టు, కాళ్లకు పసుపు, చేతికి గాజులు, మెడలో తాళి, కాళ్లకు మెట్టెలు వంటివి లేకుండా చేసే పుణ్యకార్యాలు పూజలకు ఫలితాలు దక్కవనీ, ఇలా చేస్తే లక్ష్మీ దేవీ కోపానికి గురవుతుందని నమ్మిక. నిండు ముత్తైదువుగా అలంకరించుకుని పూజ చేసినా పుణ్యకార్యాలు చేసినా దేవుతలు మెచ్చుకుని వరాలిస్తారని చెబుతారు. అలాంటి అలంకరణలో భాగమే కాళ్లకు పసుపు రాసుకోవడం.
ఇక సైంటిఫిక్ గా చూస్తే.. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇంట్లో ఆడవాళ్లు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. అలా తిరుగుతున్నప్పుడు వారి కాళ్లకున్న పసుపు ప్రభావం ఇళ్లంతా పడి క్రిమికీటకాలు రాకుండా ఉంటాయి. మరో కారణమేంటంటే.. పసుల్లో భాగంగా ఆడవారి కాళ్లు ఎప్పుడూ నీటిలో, మట్టిలో నానుతూ ఉంటాయి. ఈ కారణంగా వారి వేళ్ల మధ్య పుల్లు, కాళ్ల పగుళ్లు వస్తుంటాయి. వాటి నుంచి పాదాలను రక్షించుకునేందుకు పసుపు వారికి చాలా బాగా సహాయపడుతుంది.
కాళ్లకు పసుపు ఎలా రాసుకుంటే మంచిది..? ఎలా రాసుకుంటే దరిద్రం?
పసుపు రాసుకోవడం శుభప్రదమైనప్పటికీ రాసుకునే పద్ధతి మనకు శుభ, అశుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మహిళలు పసుపు రాసుకోవడంలో రకరకాల పద్ధతులను ఉపయోగిస్తుంటారు. కొందరు గిన్నెలో కాస్త పసుపు వేసి, నీరు పోసి కలిపి పాదాలకు అద్దుకుంటారు. ఇది అత్యున్నతమైన పద్ధది. ఇలా తడిపిన పసుపు కాళ్లకు రాసుకోవడం శుభఫలితాలనిస్తుందని భక్తులు నమ్మిక.
మరికొందరు అరచేతిలో పసుపు వేసుకునే ఆ పసులోనే కాసిన్ని నీళ్లు పోసుకుని రెండు చేతులతో రసుకుని కాళ్లకు రాసుకుంటారు. ఇంకొందరు కాళిపైనే కాస్త పసుపు వేసుకుని నీళ్లు చల్లుకుని రాసుకుంటారు. ఇది సరైన పద్ధతి కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. పసుపును కాలిపై తడపకుండ వేయడం దరిద్రపు అలవాటుగా పరిగణిస్తారు. ఇలా చేస్తే ప్రాణహాని జరిగే అవకాశాలున్నాయట.
ఇంకో విషయం ఏంటంటే.. కాళ్లకు పసుపు రాసేటప్పుడు చాలా మంది వేళ్లను ఉపయోగిస్తుంటారు. ఇది కూడా దరిద్రాన్నే సూచిస్తుందట. అరచేతులతో పసుపు రాయడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే పసుపు రాసేటప్పుడు పై నుంచి కిందకు రాయాలి. అంటే చీలమండలం దగ్గర ప్రారంభించి కాలి వేళ్లు, తర్వాత గోళ్ల వరకూ తీసుకురావాలి. ఇది శాస్త్ర ప్రకారం శుభఫలితాలన్నిస్తుంది.
అలాగే పసుపు రాసుకున్న తర్వాత చాలా మంది మహిళలు చేతులు కడుక్కుంటారు. ఇలా కడగడం కూడా దరిద్రాన్ని సూచిస్తుంది. కనుక చేతికున్న పసుపును తొలగించేందుకు గుడ్డతో తుడిచుకోవాలి. అంతేకాదు.. ఒకరి కాళ్లకు పసుపు రాసిన తర్వాత అదే చేతులతో మళ్లీ వేరే వాళ్లకు పసుపు రాయడం కూడా దరిద్రమేనని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల ఒకరికున్న ప్రతికూల శక్తులు మరొకరి వచ్చే అవకాశాలున్నాయి. కనుక ఒకరికి రాసిన తర్వాత ఆ చేతులను గుడ్డతో తుడుచుకుని మరొకరి కాళ్లకు పసుపు రాయలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.