Lord krishna: శ్రీకృష్ణుడి తల మీద నెమలి పింఛం ఎందుకు ఉంటుంది? దీని వెనుక కథ ఏంటో చూసేయండి-why does lord krishna have a peacock feather on his head check out the story behind it ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Krishna: శ్రీకృష్ణుడి తల మీద నెమలి పింఛం ఎందుకు ఉంటుంది? దీని వెనుక కథ ఏంటో చూసేయండి

Lord krishna: శ్రీకృష్ణుడి తల మీద నెమలి పింఛం ఎందుకు ఉంటుంది? దీని వెనుక కథ ఏంటో చూసేయండి

Gunti Soundarya HT Telugu
Aug 23, 2024 02:30 PM IST

Lord krishna: కృష్ణుడి తల మీద నెమలి పింఛం ఎప్పుడూ ఉంటుంది. అది లేకుండా కన్నయ్య రూపం ఊహించుకోవడం కూడా కష్టమే. అసలు కృష్ణుడు తల మీద నెమలి పింఛం య్ ఎందుకు పెట్టుకున్నాడు? దీని వెనుక ఉన్న కారణాలు, ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.

కృష్ణుడి తల మీద నెమలి పింఛం ఎందుకు ఉంటుంది?
కృష్ణుడి తల మీద నెమలి పింఛం ఎందుకు ఉంటుంది?

Lord krishna: శ్రీకృష్ణుడి అందం వర్ణనాతీతం, తన ముగ్ధమనోహరమైన రూపంతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాడు. కృష్ణుడి అందాన్ని రెట్టింపు చేసేది తన కిరీటం అందులోని నెమలి ఈక. కృష్ణుడి విలక్షణమైన అలంకారం వెనుక ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెమలి ఈకలు స్వచ్చత, సంపద, అదృష్టాన్ని సూచిస్తాయని నమ్ముతారు.

నెమలి ఈక ప్రాముఖ్యత గురించి పురాణాలలో అనేక కథలు ఉన్నాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు, సీత వనవాసంలో ఉన్న సమయంలో దాహం వేసింది. అప్పుడు రాముడిని నీరు కావాలని అడిగిందట. అప్పుడు శ్రీరాముడు సహాయం కోసం ప్రకృతిని ప్రార్థించాడు. అకస్మాత్తుగా వారి ముందు అందమైన నెమలి కనిపించింది. నీరు ఎక్కడో ఉందో తెలుసు తనని అనుసరించమని మార్గనిర్దేశం చేస్తానని చెప్తుంది. దీంతో రాముడు, సీత నెమలిని అనుసరించారు.

శ్రీరాముడి కోసం ప్రాణాలు అర్పించిన నెమలి

అడవిలోని వంకర మార్గాల గుండా వెళ్తున్నప్పుడు నెమలి వారికి దారి కనిపించడం కోసం తన ఈకలను వదిలేస్తూ వెళ్ళింది. ఈకలు బలవంతంగా తొలగించడం వల్ల మరణం సంభవిస్తుందని తెలిసినప్పటికీ నెమలి మాత్రం తన ఈకలను వదలడం కొనసాగిస్తూ వారికి మార్గనిర్దేశం చేసింది. చివరగా వాళ్ళు అందమైన పూదోటకు చేరుకున్నారు. అక్కడ వాళ్ళు తమ దాహం తీర్చుకుని విశ్రాంతి తీసుకున్నారు.

కానీ నెమలి మాత్రం నేలపై పడిపోయి చనిపోయింది. దాని ఈకలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. నెమలి నిస్వార్థమైన త్యాగానికి ముచ్చటపడిన శ్రీరాముడు నీ దయ ధైర్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా వచ్చే జన్మలో నీ జ్ఞాపకాన్ని గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నెమలి త్యాగానికి కృతజ్ఞతగా తన తల మీద నెమలి ఈకను ధరించాడని చెబుతారు.

శ్రీకృష్ణుడు తల మీద నెమలి ఈక ధరించడం వెనుక మరెన్నో కథలు కూడా ఉన్నాయి. ఒక నమ్మకం ప్రకారం రాధ తన జ్ఞాపకంగా కృష్ణుడికి నెమలి ఈక ఇచ్చిందని చెబుతారు. అందుకే రాధ మీద ప్రేమతో దాన్ని తల మీద పెట్టుకున్నాడని అంటారు. అది మాత్రమే కాదు నెమలి దేవుడైన శ్రీకృష్ణుడి భక్తికి సంబంధించిన సంజ్ఞగా భావిస్తారు. అలాగే బలరాముడు దాన్ని తమ్ముడు కృష్ణుడికి ప్రేమగా ఇచ్చాడని మరి కొందరి నమ్మకం.

నాట్యం నేర్పిన గురువు

శ్రీకృష్ణుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి పరవశించిపోయి వేణు గానం వాయిస్తూ ఉన్నాడు. వేణువు నుంచి వచ్చే మధురమైన సంగీతానికి పులకించిపోయి నెమళ్లు కృష్ణుడి చుట్టూ చేరాయి. సంగీతానికి తగ్గట్టుగా కృష్ణుడు నాట్యం చేస్తూ ఉండగా ఆయన అడుగులు గమనించి నెమళ్లు కూడా పురివిప్పి నాట్యం ఆడాయి. అలా నెమళ్ళకు నాట్యం నేర్పిన గురువుగా శ్రీకృష్ణుడు మారాడు.

తమకు నాట్యం నేర్పినందుకు గురు దక్షిణగా నెమలి పింఛం ఇచ్చాయి. దాన్ని కృష్ణుడు తమ మీద ధరించాడు. ఇది కృష్ణుడి రూపాన్ని మరింత అందంగా మార్చింది. పవిత్రమైన పక్షి నెమలిగా హిందువులు భావిస్తారు. అందుకే చాలా మంది నెమలి ఈకలను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఇవి ఉంటే అదృష్టం, సంపద ఉన్నట్టేనని భావిస్తారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.