Emerald: ఎమరాల్డ్ ఎవరు ధరించవచ్చు? దీని పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి-who should wear emerald stone know the rules and benefits of wearing it ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Emerald: ఎమరాల్డ్ ఎవరు ధరించవచ్చు? దీని పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి

Emerald: ఎమరాల్డ్ ఎవరు ధరించవచ్చు? దీని పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి

Gunti Soundarya HT Telugu
Sep 10, 2024 12:30 PM IST

Emerald: జాతకంలో బుధ గ్రహం అశుభ ప్రభావాలను తగ్గించడానికి పచ్చ రత్నాన్ని ధరించడం శుభప్రదంగా పరిగణిస్తారు. పచ్చరాయి ధరించడం వల్ల బుధ గ్రహాన్ని బలపరుస్తుందని చెబుతారు. ఆనందం, అదృష్టాన్ని పెంచుతుందని నమ్ముతారు.

ఎమరాల్డ్ ఎవరు ధరించవచ్చు?
ఎమరాల్డ్ ఎవరు ధరించవచ్చు?

Emerald: ఈ మధ్య కాలంలో పచ్చలు, కెంపులు ధరించడం ఫ్యాషన్ గా మారిపోయింది. ఇవి మనిషికి అందాన్ని మాత్రమే కాకుండా రిచ్ నెస్ ను ఇస్తున్నాయి. పచ్చల హారం ఒక్కటి చాలు మెడలో ఎంతో అందంగా కనిపిస్తుంది.

ఇటీవల జరిగిన అనంత్ అంబానీ పెళ్ళిలో కూడా అంబానీ కుటుంబ సభ్యులు పచ్చలు పొదిగిన ఆభరణాలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అసలు పచ్చలు ఎవరు ధరించవచ్చు. ఇవి ధరించడానికి ఉన్న నియమాల గురించి తెలుసుకోవాలి. ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ పచ్చ రత్నం చాలా ఖరీదైనది.

జ్యోతిషశాస్త్రంలో పచ్చ రత్నం లేదా ఎమరాల్డ్ బుధ గ్రహం రత్నంగా పరిగణిస్తారు. ఇది గడ్డి వంటి ఆకుపచ్చ రంగు రత్నం. జాతకంలో బుధుని స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రత్నాన్ని ధరించడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఈ రత్నాన్ని బుధుడు ఆధిపత్యంలో ఉన్న కాలంలో జన్మించిన వారు ధరించాలి.

జూన్ 15 నుండి జులై 14 లేదా సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 14 మధ్య జన్మించిన వారు ఈ రత్నం ధరించవచ్చు. ఈ రత్నం రాడిక్స్ 5తో జన్మించిన వారికి అంటే ఏ నెలలోనైనా 5, 14, 23వ తేదీలలో శుభప్రదంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే కంగారుపడే వారికి, మనసు ఎక్కువగా కలత చెందే వారికి ఈ రత్నం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మంచి ఫలితాల కోసం జ్యోతిష్య సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఈ రత్నాన్ని ధరించండి. మరకతం ధరించే విధానం తెలుసుకుందాం.

ఎమరాల్డ్ ఎలా ధరించాలి?

రత్న జ్యోతిష్యం ప్రకారం ఎమరాల్డ్ రత్నం బంగారు ఉంగరంలో ధరించాలి. ఈ రత్నాన్ని ఎల్లప్పుడూ మధ్య వేలుకు ధరించడం ఉత్తమం. 5, 14, 23 తేదీలలో జన్మించిన వారు సూర్యోదయం తర్వాత 2 గంటల తర్వాత ఈ రత్నాన్ని ధరించవచ్చు.

బుధవారం పచ్చ రత్నాన్ని ధరించడం చాలా శుభప్రదంగా, ఫలప్రదంగా పరిగణించబడుతుంది. ఎమరాల్డ్ పైభాగాయం ఆక్వామారిన్. పచ్చ రత్నం ధరించలేని వాళ్ళు దీన్ని ధరించవచ్చు.

పచ్చలు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు

పచ్చని ధరించడం వల్ల తెలివితేటలు, జ్ఞాపకశక్తి పెరుగుతాయని నమ్ముతారు. ఎమరాల్డ్ ధరించడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని చెబుతారు. ఐశ్వర్యం, సంతోషం, అదృష్టాన్ని పెంపొందించడానికి పచ్చ రత్నాన్ని ధరించడం శ్రేయస్కరం. ఇవి ధరించడం వల్ల డబ్బు కొరత ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. 

పచ్చని ధరించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సంబంధాలు బలపడతాయని కూడా నమ్ముతారు. ఈ రత్నం ఉద్యోగం, వ్యాపారంలో పురోగతికి మంచిదని భావిస్తారు. బుధుడు వ్యాపారం, వాక్కు మొదలైన వాటికి కారకంగా భావిస్తారు. అందువల్ల బుధుడికి సంబంధించిన ఈ రత్నం ధరిస్తే వ్యాపారంలో రాణిస్తారు. చేతికి ఉంగరంగా ధరించడం వల్ల ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు.

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

టాపిక్