Ayyappa Deeksha: ఇలాంటి వారు అయ్యప్ప మాల అస్సలు వేయకూడదు- వేశారంటే పాపం మూట గట్టుకున్నట్టే!!
Ayyappa Deeksha:కార్తీకమాసం వచ్చిందంటే ఎక్కడ చూసినా అయ్యప్ప దీక్ష వేసుకున్న వారే కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ మాల ధరించవచ్చా? ఎలాంటి వారు అయ్యప్ప స్వామి దీక్షా మాల వేసుకోకూడదు?
కార్తీకమాసం మొదలుకుని మకర సంక్రాంతి వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నవారే తారసపడతారు. చాలా మంది అయ్యప్ప భక్తులు ఈ దీక్షను చేపట్టి మండలం పాటు కఠినమైన నియమాలను పాటిస్తారు. అయితే హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం.. అయ్యప్ప దీక్ష చాలా పవిత్రమైనది. ప్రతి ఒక్కరూ ఈ దీక్షకు అర్హులుగా పరిగణించబడరు. ముఖ్యంగా కొందరు వ్యక్తులు అయ్యప్ప దీక్ష వేసుకోవడం వల్ల అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయ్యప్ప దీక్షను వేసుకోకూడని వారెవరో తెలుసుకుందాం..
* అయ్యప్ప దీక్షను ఎలాంటి వారు వేసుకోకూడదు?
తల్లిదండ్రులు గతించి ఏడాది పూర్తి కానివారు ఈ దీక్షకు అనర్హులు. గతించిన ఏడాది కాలం వరకూ వీరు సూతకంలో ఉంటారు. సూతకపు సమయంలో అయ్యప్ప దీక్ష వేసుకోవడం శుభ సూచకం కాదు.
- అయ్యప్ప దీక్షా నియమాల ప్రకారం.. సవతి తల్లిదండ్రులు చనిపోతే కూడా 6 నెలల దాటిన తర్వాతే దీక్షా మాల ధరించేందుకు అర్హులు.
- భార్య చనిపోయిన వ్యక్తులు కూడా చనిపోయి 6 నెలలు దాటిన తర్వాత మాత్రమే అయ్యప్ప మాల ధరించవచ్చు.
-పెద్దనాన్న-పెద్దమ్మ, పిన్ని-బాబాయిలు గతించి ఉంటే 45రోజుల పాటు వీరు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలి.
-పిల్లలు, సోదరులు, మేనమామలు, బామ్మా-తాతలు మరణిస్తే వారు 41రోజులు దాటాక మాత్రమే అయ్యప్ప దీక్షను ధరించవచ్చు.
-కూతురు, అల్లుడు, కోడలు, మరదలు, వదిన, బావ వంటి వారు చనిపోయి ఉంటే వారు నెల రోజుల పాటు సూతకంలో ఉన్నట్లే. కనుక ఈ సమయంలో అయ్యప్ప మాల ధరించకూడదు.
- రక్త సంబంధీకులు, ఇంటి పేరు గలవారు గతిస్తే 21రోజుల పాటు అయ్యప్ప దీక్షకు అనర్హులుగానే భావించాలి.
- భార్య, కూతురు, కోడలు, మరదలు వంటి సొంత కుటుంబ సభ్యుల్లో ఎవరైనా 7నెలల గర్భిణి అయి ఉంటే ఆ ఇంట్లోని వారు అయ్యప్ప మాలను ధరించకూడదు.
-10 సంవత్సరాల లోపు ఉండే ఆడపిల్లలు మాత్రమే అయ్యప్ప మాలకు అర్హులు. దాటిన యెడల అయ్యప్ప మాల వేయడం పాపంగా పరిగణిస్తారు. అలాగే 50 సంవత్సరాలు పైబడిన వారు మాల ధరించేందుకు అర్హులుగా భావిస్తారు. ఇందుకు కారణం మహిళల్లో ఉండే రుతుస్రావ గుణం.
అయ్యప్ప దీక్షలో మరిన్ని ముఖ్య నియమాలేంటంటే..
-మాల ధరించి ఉండగా సొంత కుటుంబీకులు, బంధువులు ఎవరైనా చనిపోతే ఆ వార్త విన్న వెంటనే దీక్ష ముగించుకోవాల్సి ఉంటుంది.
- అలాగే అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు కూతులు పుష్పవతి అయినా కూడా గురు స్వామి సమక్షంలో దీక్షను వెంటనే విరమించుకోవాలి.
ఇంకా ఏమైనా సందేహాలుంటే దగ్గర్లో ఆచార్యుడని లేదా గురు స్వామిని సంప్రదించి అయ్యప్ప దీక్షా నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.