Navaratri 2024: నవరాత్రి కోసం పూజ సామగ్రిని ఎప్పుడు కొనుగోలు చేయాలి, ఏయే వస్తువులు కావాలి
Navaratri 2024: అక్టోబర్ 3 నుంచి దేవి నవరాత్రులు ప్రారంభంఅవుతాయి. మొదటి రోజు కలశ స్థాపన తర్వాత పూజకు ఎలాంటి వస్తువులు కావాలి. వాటిని ఎప్పుడు కొనుగోలు చేయాలి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకోండి. నవరాత్రికి అమ్మవారికి సమర్పించే మేకప్ వస్తువుల గురించి తెలుసుకోండి.
ఈ సంవత్సరం కూడా శారదీయ నవరాత్రులలో మొదటి రోజు అక్టోబరు 3న శక్తి ఆరాధనతో దుర్గా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. నవరాత్రి మొదటి రోజు కలశ స్థాపన చేస్తారు.
ఈ రోజున ఒక శుభ సమయంలో కలశాన్ని ఏర్పాటు చేసి, అఖండ జ్యోతిని వెలిగించడం ద్వారా దుర్గాదేవి ప్రసన్నురాలు అవుతుందని చెబుతారు. ఈ తొమ్మిది రోజులలో ఘట స్థాపన, హారతి, సిద్ధ పీఠాల దర్శనంతో పాటుగా దుర్గా సప్తశతి నిత్య పారాయణం చేయడం చాలా ప్రయోజనకరం. నవరాత్రుల రోజుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, పారాయణాలు జరుగుతాయి. మీరు నవరాత్రి పూజలు చేస్తుంటే దానికి సంబంధించిన వస్తువులను ఎప్పుడు కొనుగోలు చేయాలో మీరు తెలుసుకోండి.
అక్టోబర్ 2న సర్వ పితృ అమావాస్య వచ్చింది. ఈరోజు పూర్వీకులకు తర్పణం సమర్పించి వారి పేరు మీద దీపం వెలిగించిన తర్వాత నవరాత్రి ఉపవాసానికి సంబంధించిన సామగ్రిని కొనుగోలు చేయవచ్చు. అసలే ఈ సంవత్సరం నవరాత్రి వ్రతం సందర్భంగా దుర్గామాత కలశాన్ని నెలకొల్పే సమయం తెల్లవారుజామున వచ్చింది. అటువంటి పరిస్థితిలో మీరు ఇంత తెల్లవారుజామున వస్తువులు కొనుగోలు చేయలేరు. అందుకే ముందు రోజే కొని పెట్టుకోవడం మంచిది. నవరాత్రి ఉత్సవాలకు ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయాలి, పూజా సామాగ్రికి సంబంధించిన పూర్తి జాబితా ఇక్కడ చూడండి.
కలశ సంస్థాపన కోసం
మామిడి ఆకులు, మట్టి కుండలు, బార్లీ విత్తనాలు, నీరు, ఎర్రటి వస్త్రం, కొబ్బరికాయ, కల్వా, రోలి, తమలపాకులు, గంగాజలం, నాణేలు, దుర్వ, గోధుమలు, బియ్యం, పసుపు, తమలపాకులు, కర్పూరం కొనుగోలు చేయాలి. అమ్మవారిని అలంకరించడం కోసం ఎరుపు రంగు చూనారి తీసుకోవాలి. ఇది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనదిగా నమ్ముతారు.
అఖండ జ్యోతి వెలిగించిన తర్వాత అది ఆరిపోకుండా చూసుకోవాలి. అలాగే దీపం వెలిగించిన ఇంటిని ఎప్పుడూ మూసివేయకూడదు. ఏదైనా అవసరం ఉండి బయటకు వెళ్లాల్సి వస్తే ఇంట్లో ఎవరో ఒకరు తప్పకుండా ఉండాలి. జ్యోతి కొండెక్కకుండ ఎప్పటి కప్పుడు నెయ్యి వేస్తూ ఉండాలి.
శారదీయ నవరాత్రుల కోసం పూజా సామగ్రి
ధూపం, పూలు, పండ్లు, తమలపాకులు, లవంగాలు, యాలకులు, దుర్వ, కర్పూరం, అక్షతం, తమలపాకులు, కొబ్బరికాయ, కల్వా, ఎరుపు చునారి, ఎర్రని వస్త్రాలు, ఎర్ర చందనం, దుర్గా చిత్రం లేదా దుర్గాదేవి విగ్రహం, నెయ్యి దీపం, అలంకరణ వస్తువులు పెట్టుకోవాలి.
దుర్గాదేవికి 16 రకాల అలంకరణ వస్తువులు సమర్పించడం వల్ల స్త్రీ సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని నమ్ముతారు. మేకప్ వస్తువులు సమర్పిస్తే అమ్మవారు సంతోషిస్తారని భక్తుల విశ్వాసం. ఎరుపు రంగు చునారి, ఎర్రని దుస్తులు, కుంకుమ, ఎర్ర బొట్టు, మెహందీ, కాటుక, గాజులు, చెవి కమ్మలు, మెడకు నెక్లెస్, తలకు పెట్టుకునే బ్యాండ్, నడుముకు వడ్డాణం, పెర్ఫ్యూమ్, పౌడర్ వంటి వాటిని అమ్మవారికి సమర్పించుకోవచ్చు. వీటిని సమర్పిస్తే అదృష్టం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.