Solar eclipse 2024: సూర్య గ్రహణం తర్వాత ఎలాంటి వస్తువులు దానం చేయాలి? ఏం పనులు చేయాలో తెలుసుకోండి
Solar eclipse 2024: అక్టోబర్ 2న సూర్య గ్రహణం పూర్తయిన తర్వాత కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. ఏయే వస్తువులు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
Solar eclipse 2024: ఈ సంవత్సరం చివరి, రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీన ఏర్పడబోతుంది. ఈరోజే సర్వ పితృ అమావాస్య వచ్చింది. కన్యా రాశిలో సూర్య గ్రహణం ఏర్పడుతోంది.
ప్రస్తుతం సూర్యుడు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో గ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం కంకణాకార గ్రహణంగా పిలుస్తారు. అంటే రింగ్ ఆఫ్ ఫైర్. గ్రహణం స్పర్శ, మోక్ష కాలం గురించి తెలుసుకుందాం.
గ్రహణం సూతక్ కాలం
పండితులు చెప్పే దాని ప్రకారం చంద్రగ్రహణం సూతక్ కాలం 9 గంటల ముందు నుంచి పరిగణలోకి తీసుకుంటారు. అదే సూర్యగ్రహణం అయితే సూతక్ కాలం 12 గంటల ముందు నుంచి ప్రారంభమవుతుంది. ఈ సూతక్ కాలంలో పూజ మొదలైన అనేక పనులు జరగవు. దేవాలయాల తలుపులు మూసి ఉంటాయి. ఈ సూర్య గ్రహణం భారత్ లో కనిపించదు. అందువల్ల సూతక్ కాలం కూడా పరిగణలోకి తీసుకోరు. గ్రహణం నాటి మోక్షకాలం తర్వాత ఆలయాల్లో శుద్ధి చేసి స్నానం చేసి పూజలు ప్రారంభిస్తారు.
గ్రహణం స్పర్శ, మోక్ష కాలం ఏమిటి?
గ్రహణం ప్రారంభం కావడాన్ని గ్రహణ స్పర్శ అంటారు. అదే సమయంలో గ్రహణం మధ్య కాలాన్ని గ్రహణ మధ్యం అని, చివరిలో ఉన్న కాలాన్ని గ్రహణ మోక్షం అని పిలుస్తారు. ఈ గ్రహణం భారతదేశంలో లేదు. కానీ అది ఎక్కడ కనిపించినా గ్రహణం దాని స్పర్శ, మధ్య, మోక్ష కాలం ఉంటుంది. భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం రాత్రి 9.13 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ విధంగా గ్రహణ స్పర్శ సమయం రాత్రి 9.13 గంటలకు, మోక్ష సమయం తెల్లవారు జామున 3.17 గంటలకు ఉంటుంది. అర్జెంటీనా, అమెరికా, బ్రెజిల్, మెక్సికో, న్యూజిలాండ్, పెరూ సహా పలు దేశాల్లో ఈ గ్రహణం కనిపించనుంది.
ఇవి దానం చేయండి
గ్రహణ కాలం అక్టోబర్ 2 రాత్రి నుంచి తెల్లవారుజామున అంటే అక్టోబర్ 3కు ముగుస్తుంది. 3వ తేదీ నుంచి దదేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. గ్రహణం భారత్ లో కనిపించకపోయినప్పటికీ దాని ప్రభావం మొత్తం పన్నెండు రాశుల మీద ఉంటుంది. అందువల్ల వాటి నుంచి తప్పించుకునేందుకు గ్రహణం తర్వాత దానం చేయడం ఉత్తమం.
గ్రహణ సమయం తర్వాత పుణ్య క్షేత్రంలో స్నానమాచరించి దానం చేస్తారు. శారదీయ నవరాత్రుల ప్రతిపాదంలో ఏయే వస్తువులు దానం చేయాలి. గ్రహణం తర్వాత చేయాల్సిన పనులు ఏంటో తెలుసుకుందాం. ఇంట్లో గంగాజలం కలిపిన నీటిని చల్లుకోవచ్చు. అలాగే శనగలు, గోధుమలు, కాయధాన్యాలు, బెల్లం సహా నిత్యావసర వస్తువులు అవసరంలో ఉన్న వారికి పేద వ్యక్తులకు దానం చేయవచ్చు.
రాహు కేతువులకు సంబంధించిన దానధర్మాలు కూడా చేస్తారు. అందులో బూట్లు ఎక్కువగా దానం చేయవచ్చు. అలాగే అరటి పండ్లు, పాలు, పప్పులు దానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. గ్రహణం తర్వాత జాతకం లగ్నం, రాశి చక్రం ప్రకారం అర్హత కలిగిన బ్రహ్మణుడికి వస్త్ర, అన్నదానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు.
ఈ పనులు చేయండి
ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. కేతు శాంతి పూజ చేయించాలి. కేతు మంత్రాన్ని పఠించాలి. ఓం కేం కేతవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. కేతువును శాంతపరచడం కోసం కట్సీ రాయిని ధరించవచ్చు. అది జ్యోతిష్యుల సలహా తీసుకున్న తర్వాత ధరించడం ఉత్తమం.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
టాపిక్