Panchangam: పంచాంగం అంటే ఏమిటి? వారం, తిథి, నక్షత్రం వేటిని సూచిస్తాయి-what is the meaning of panchagam what does the week tithi and nakshatra represent ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Panchangam: పంచాంగం అంటే ఏమిటి? వారం, తిథి, నక్షత్రం వేటిని సూచిస్తాయి

Panchangam: పంచాంగం అంటే ఏమిటి? వారం, తిథి, నక్షత్రం వేటిని సూచిస్తాయి

HT Telugu Desk HT Telugu
Mar 09, 2024 04:33 PM IST

Panchangam: అందరూ పంచాంగం ప్రకారం ముహూర్తాలు చూసుకుంటారు. కానీ అసలు పంచాంగం అంటే ఏంటి? వాటిలో ఉంటే తిథి, వారం, నక్షత్రం వేటిని సూచిస్తాయనే విషయాలు గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.

పంచాంగం అంటే ఏంటి?
పంచాంగం అంటే ఏంటి?

Panchangam: పంచాంగం అనేది సంస్కృత పదం. పంచాంగం అనగా ఐదు అంగాలు కలది. పంచాంగంలో ఉన్న ఐదు అంగాలు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణము అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పైన పేర్కొన్న ఐదు అంగాలు మహాకాలుడు అయిన ఈశ్వరుని ఐదు శిరస్సు అవి. అఘోర అగ్ని వామదేవా జలం, పద్యోజాత పృథ్వి, తత్పురుష వాయువు, ఈశాన ఆకాశం. పైన పేర్మాన్న ఐదు అంగాలు పంచభూతాలు శాసిస్తాయి. పంచ దేవతలు పాలిస్తారు. పంచాంగం కాలం నాణ్యత తెలుపును అని చిలకమర్తి తెలియచేశారు.

పంచాంగంలో ఏవి దేనిని సూచిస్తాయి

వారం: అగ్నిత్రత్త్వం. అధిపతి కుజుడు, అధిదేవత సూర్యుడు.

తిథి: జలతత్త్వం. అధిపతి శుక్రుడు, అధిదేవత గౌరి / దుర్గా.

నక్షత్రం: వాయుతత్త్వం అధిపతి శని, అధిదేవత రుద్ర.

కరణము: పృథ్వితత్త్వం అధిపతి బుధుడు, అధిదేవత గణపతి

యోగం: ఆకాశతత్త్వం. అధిపతి గురువు, అధిదేవత విష్ణు అని చిలకమర్తి తెలిపారు.

ఈ ఐదు అంగాలు వ్యక్తి జాతక చక్రంలో ఎలా ఉపయోగించాలి అన్న విషయం తెలుసుకోవాలి. అంటే ముందుగా మనం ప్రతి అంగము గుర్తించ క్షుణ్ణముగా అధ్యయనం చేయాలి. మానవ శరీరం పంచభూతాలచే నిర్మితమైనది. మన దేహంలో గట్టిగా ఉన్న భాగములు పృథ్వి. ద్రవముగా ఉన్నదంతా జలం. ప్రకాశంగా ఉన్నదంతా తేజస్సు. చలనముతో కూడిఉన్నది వాయువు. మనలో డొల్లగా ఉన్నదంతా ఆకాశం.

కుజుడు, శుక్రుడు, శని, బుధుడు, బృహస్పతి వీరు కాలం నాణ్యత తెలుపుతారు. కుజుడు వారం ప్రాధాన్యతను తెలుపును. శుక్రుడు తిథి నాణ్యతను తెలుపును. శని నక్షత్రం ప్రాధాన్యతను తెలుపును. బృహస్పతి యోగం ప్రాధాన్యతను తెలియచేస్తాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner