Lakshmi yogam: చంద్రుడు, కుజుడు కలయికతో లక్ష్మీ యోగం.. ఈ రాశుల జాతకుల సంపదకు ఢోకా ఉండదు-moon and mars conjunction will create lakshmi yogam in makara rashi these zodiac signs get profits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lakshmi Yogam: చంద్రుడు, కుజుడు కలయికతో లక్ష్మీ యోగం.. ఈ రాశుల జాతకుల సంపదకు ఢోకా ఉండదు

Lakshmi yogam: చంద్రుడు, కుజుడు కలయికతో లక్ష్మీ యోగం.. ఈ రాశుల జాతకుల సంపదకు ఢోకా ఉండదు

Gunti Soundarya HT Telugu
Mar 06, 2024 06:48 PM IST

Lakshmi yogam: చల్లని చూపు, శాంత స్వభావం కలిగిన గ్రహం చంద్రుడు. ప్రస్తుతం చంద్రుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు. నేడు(మార్చి 6) చంద్రుడు మకర రాశి ప్రవేశం చేయడంతో లక్ష్మీ యోగం సంభవిస్తుంది.

చంద్రుడు, కుజుడు కలయికతో లక్ష్మీ యోగం
చంద్రుడు, కుజుడు కలయికతో లక్ష్మీ యోగం (pixabay)

Lakshmi yogam: చంద్రుడు తన రాశి మార్చుకోబోతున్నాడు. మనోభావాలు, సృజనాత్మకత, భావోద్వేగాలకు కారకుడుగా చంద్రుడిని భావిస్తారు. మార్చి 6వ తేదీన ధనస్సు రాశి నుంచి చంద్రుడు శనికి చెందిన మకర రాశి ప్రవేశం చేశాడు. ఇతర గ్రహాలతో పోలిస్తే చంద్ర భగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అతి వేగంగా ప్రవేశిస్తాడు. 

చంద్రుడు సంచరించిన వెంటనే మకరంలోకి గ్రహాల అధిపతి కుజుడు కూడా వస్తాడు. ఫలితంగా మకర రాశిలో కుజుడు, చంద్రుడు కలయిక జరుగుతుంది. దీనివల్ల లక్ష్మి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం మార్చి 8 వరకు అంటే మహాశివరాత్రి వరకు ఉంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక ప్రభావంతో కొన్ని రాశుల వారికి మహా శివరాత్రికి ముందే మంచి రోజులు మొదలవుతాయి. 

కుజుడు, చంద్రుడు సంయోగం ప్రభావం 

చంద్రుడు, కుజ సంయోగాన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రమంగళ యోగంగా  పిలుస్తారు. ఇది సంపద, నాయకత్వాన్ని ఇచ్చే అత్యంత శుభకరమైన యోగం. ఈ సంయోగం వల్ల వ్యక్తికి బలమైన సంకల్పం ఉంటుంది. లక్ష్యాలను సాధించడానికి కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం పొందుతారు. ఏదైనా విషయంలో నిర్ణయాలు మొండిగా తీసుకుంటారు. ఒకసారి కోపం ప్రదర్శిస్తారు. 

కుజుడు ధైర్యము, శక్తి, పరాక్రమం, కోపానికి ప్రతీకగా భావిస్తారు. ఈ రెండో శక్తివంతమైన కలయిక జరిగినప్పుడు వాటి ప్రభావం వల్ల వ్యక్తి ధైర్యంగా, శక్తివంతంగా మారతాడు. ఈ గ్రహాల ప్రభావం కలిగిన రాశుల వాళ్ళు ఉద్వేగ భరితులుగా ఉంటారు. శుభ స్థానంలో చంద్రుడు, అంగారకుడు ఉంటే సంపద, శ్రేయస్సు లభిస్తుంది. కష్టాలు ఉన్నప్పటికీ సంకల్ప బలంతో వాటిని అధిగమించగలుగుతారు. 

ఒకవేళ ఈ రెండు గ్రహాల కలయిక మీ జాతకంలో బలహీనమైన స్థానంలో ఉంటే కోపం, మొండితనం వల్ల తీసుకునే నిర్ణయాలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు.  చంద్రుని సంచారం వల్ల ఏర్పడే లక్ష్మీ యోగం వల్ల ఏ ఏయే రాశుల వారిని సుసంపన్నం చేయబోతుందో చూద్దాం. 

మేష రాశి 

చంద్రుడు, కుజ గ్రహాల కలయిక వల్ల ఏర్పడే లక్ష్మీ యోగం మేష రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పాజిటివ్ ఫీలింగ్ తో పనుల్లో ముందుకు సాగుతారు. నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మునుపటికంటే మెరుగ్గా ఉంటుంది. పని కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమించగలుగుతారు. 

సింహ రాశి 

సింహ రాశి వారికి లక్ష్మీ యోగం శుభ ఫలితాలు ఇస్తుంది. మనసు ధార్మిక కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటుంది. కెరీర్ పరంగా ఉత్పాదకంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం మధ్య సమతుల్యత పాటించడం ముఖ్యం.

మిథున రాశి

చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు వస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలు క్రమంగా తొలగిపోతాయి. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. సంతానం వైపు నుంచి శుభవార్త అందుకుంటారు.