వార ఫలాలు.. ఉద్యోగస్తులకు పదోన్నతులు, అనుకున్న ప్రదేశానికి బదిలీ అవుతుంది-weekly horoscope in telugu may 12th to may 18th rasi phalalu check zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వార ఫలాలు.. ఉద్యోగస్తులకు పదోన్నతులు, అనుకున్న ప్రదేశానికి బదిలీ అవుతుంది

వార ఫలాలు.. ఉద్యోగస్తులకు పదోన్నతులు, అనుకున్న ప్రదేశానికి బదిలీ అవుతుంది

HT Telugu Desk HT Telugu
May 12, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. మే 12వ తేదీ నుంచిమే 18వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

వార ఫలాలు మే 12 నుంచి మే 18 వరకు
వార ఫలాలు మే 12 నుంచి మే 18 వరకు (freepik )
పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

రాశిఫలాలు (వార ఫలాలు) 12.05.2024 నుండి 18.05.2024 వరకు

సంవత్సరం : శ్రీ కోధి నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : వైశాఖము

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. పెట్టుబడులు లేదా కొంత ఆస్తిని విక్రయించడం ద్వారా ఊహించని ఆర్థిక లాభాలుంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. మీరు సంభాషించేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. సంతానపరంగా కలసివచ్చును. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. కుటుంబ సభ్యులతో ఉన్న సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి. గొడవలకు దూరంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి కోసం ధనమును ఖర్చు చేసే అవకాశముంది. మేష రాశివారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుణ్ణి పూజించినట్లయితే మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. నూతన ఉద్యోగాలలో విజయం సాధిస్తారు. అధికారులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుతుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందముగా గడుపుతారు. విలాస ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం అనుకూలించును. మీ పనిని ఉత్సాహంగా పూర్తి చేస్తారు. పొదుపుపై ఎక్కువ శ్రద్ద పెట్టడం మంచిది. కెరీర్‌ పరంగా మీకు పనిభారం, ఒత్తిడి అధికమగును. సంతాన ఆరోగ్యపరంగా ఊహించని ఖర్చులుంటాయి. విద్యార్థులకు మధ్యస్థం. వృషభ రాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజు దుర్గాదేవిని పూజించాలి.

మిథున రాశి

వార ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ప్రయాణాలు కలసివస్తాయి. స్నేహితులు, బంధువుల కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు. విదేశీ ప్రయాణానికి సంబంధించి శుభవార్తలుంటాయి. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ద్వారా ధనమును పొందుతారు. పూర్వీకుల ఆస్తి నుండి డబ్బును పొందే అవకాశం ఉన్నది. సంతానపరంగా చదువుల్లో విజయం సాధిస్తారు. కొన్ని ఆరోగ్య సమస్యలుంటాయి. కనకధార స్తోత్రం పఠించండి. మిథున రాశి వారు ఈ వారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. స్థాన చలన మార్పులుంటాయి. మీ అజాగ్రత్త వలన విలువైన పత్రాలు చేజార్చుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలుంటాయి. ఆస్తి వ్యవహారాల్లో కొన్ని సమస్యలుంటాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు వెళ్ళే అవకాశముంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలుంటాయి. కమ్యూనికేషన్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటకరాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు అనుకూలంగా ఉన్నది. భూమి లేదా వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలుంటాయి. ఉద్యోగస్తులకు స్థాన చలన మార్పులుంటాయి. కుటుంబంతో ఆనందముగా గడుపుతారు. బంధుమిత్రులతో విభేదాలేర్పడే సూచనలున్నాయి. అనసవర ఖర్చులుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం అనుకూలించును. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. అనుకున్న పనులు నెరవేరతాయి. కార్య సాఫల్యం ఉంది. ఆర్థికంగా కలసివస్తుంది. సమయానుకూల నిర్ణయాలతో ముందుకు సాగుతారు. సింహ రాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికమగును. సహనంతో వ్యవహరించాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో అభిప్రాయభేదాలు ఏర్పడే సూచనలున్నాయి. వ్యాపారస్తులకు ఖర్చులుంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ నోటి దురుసు తగ్గించుకోవాలి. పెట్టుబడులను వాయిదా వేయటం మంచిది. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. విశ్రాంతి, సరైన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కన్యా రాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు కోసం మహా విష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. మీ రంగంలో ప్రశంసలు, గుర్తింపును పొందుతారు. బంధువుల సహకారంతో ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకు మంచి సమయం. ఉద్యోగస్తులకు పదోన్నతులు, అనుకున్న ప్రాంతానికి బదిలీలు ఉంటాయి. భూమి లేదా ఆస్తిని కొనుగోలుకు ప్రయత్నిస్తారు. ప్రయాణాల్లో, కమ్యూనికేషన్‌ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. విదేశీ విద్య కోసం ప్రయత్నించేవారికి శుభవార్త లభిస్తుంది. విలువైన పత్రాలను పోగొట్టుకుంటారు. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మధ్యస్థం. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోరాదు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడిపెదరు. అప్పు చెల్లించడానికి చాలా ధనమును ఖర్చు చేసెదరు. విద్యార్థులకు మంచి సమయం. కోరుకున్న సంస్థల్లో ప్రవేశం కూడా పొందుతారు. గురుదక్షిణామూర్తిని పూజించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలుంటాయి. నిరుద్యోగులకు అధికారుల సిఫార్సుతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. మీ ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రులతో ఊహించని కలహాలుంటాయి. ధనూ రాశి వారు ఈవారం మరింత శుభఫలితాల కోసం సూర్యాష్టకాన్ని పఠించడం. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

వార ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. బంధువులతో అభిప్రాయ భేదాలేర్పడతాయి. వ్యాపార ఉద్యోగాలలో అంత అనుకూలంగా లేదు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగపరంగా అనుకూలంగా లేదు. రుణ ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఖర్చులు విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారస్తులు తీసుకున్న నిర్ణయాలు కలసి రావు. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి వ్యాపారపరంగా అనుకూల సమయం. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ ఉంటుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలించును. విద్యార్థులకు అనుకూలం. మీన రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి. లలితా సహస్ర నామాన్ని పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel